ఎర్రచందనం స్మగ్లర్ మణివణ్ణన్ అరెస్ట్

26 May, 2015 09:46 IST|Sakshi

కడప : మరో ఎర్ర చందనం బడా స్మగ్లర్ను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. స్మగ్లర్ మణివణ్ణన్ను పోలీసులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. హర్యానాలో పట్టుబడ్డ అంతర్జాతీయ స్మగ్లర్  స్మగ్లర్ ముఖేష్ బదానియా ఇచ్చిన సమాచారం మేరకు మణివణ్ణన్ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మణి అణ్ణన్కు అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయి.

కాగా ఎర్రచందనం అక్రమ రవాణా వ్యవహారం చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లాల్లో హాట్ టాపిక్‌గా మారింది. శేషాచలం అడవుల్లో తమిళనాడుకు చెందిన ఎర్ర కూలీల ఎన్‌కౌంటర్ మొదలు చర్చ మరింత తీవ్రమైంది. జిల్లా ఎస్పీ నవీన్ గులాఠి  టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి ఎర్రచందన అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారి స్థావరాలను పెకిలిస్తుండటంతో స్మగ్లర్లలో దడ మొదలైంది.

హర్యానాకు చెందిన సోంబేర్ సింగ్, కరంబీర్‌లతోపాటు హైదరాబాద్‌కు చెందిన సంజయ్, వినోద్‌ల కోసం కూడా అన్వేషణ సాగుతోంది. ఈ నేపథ్యంలో రహస్య స్థావరాలకు వెళ్లి దాక్కున్న స్మగ్లర్ల గురించి నిఘా బృందం ఆరా తీస్తోంది. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో మరి కొందరు దాక్కున్నారనే సమాచారం మేరకు వారిని పట్టుకొనేందుకు పోలీసులు వ్యూహ రచన చేశారు. ఈ సందర్భంగా మణివఅణ్ణన్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం అతడిని కడపకు తరలించారు. అతడిని నేడు కోర్టులో హాజరు పరచనున్నారు.

మరిన్ని వార్తలు