మూడు రాజధానులకే మా మద్దతు

10 Mar, 2020 03:51 IST|Sakshi
దీక్ష శిబిరంలో మాట్లాడుతున్న నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాస్, శిబిరంలో దళిత, ప్రజా సంఘాల నాయకులు

అమరావతిలో దళిత, బీసీ, ప్రజా సంఘాల రిలే దీక్షలు 

మీ బినామీల స్వప్రయోజనాలే ముఖ్యమా చంద్రబాబూ? 

అందుకే పాలన వికేంద్రీకరణపై కుట్రలు పన్నుతున్నావా..

సాక్షి, గుంటూరు/తుళ్లూరు రూరల్‌: మూడు రాజధానులకే తమ మద్దతంటూ అమరావతిలో దళిత, బీసీ, మహిళా, ప్రజా సంఘాల నేతలు గళమెత్తారు. రాజధానిలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలిస్తే అగ్రకులాల వారు ఎందుకు ఒప్పుకోవడం లేదంటూ మండిపడ్డారు. రాజధాని వికేంద్రీకరణకు, పేదల ఇళ్ల స్థలాలకు మద్దతుగా మందడంలో సోమవారం ఏపీ బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నేత బాబ్జి, దళిత నేత ఆకుమర్తి చిన్న, రాజధాని ప్రాంత ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మల్లవరపు నాగయ్య, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాస్, దళిత వర్గాల ఫెడరేషన్‌ అధ్యక్షుడు చెట్టే రాజు, మాలమహానాడు నాయకురాలు సంకూరి నాగలత, మహిళా నాయకురాలు సుభాషిణి, ఎంఎస్‌ఎఫ్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పిడతల అభిషేక్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారేమన్నారంటే.. 
- చంద్రబాబు తన బినామీల స్వప్రయోజనాల కోసమే రాజధాని వికేంద్రీకరణకు అడ్డుపడుతున్నారు.  
- రాజధానిలో 50 వేల మంది పేదలకు ఇళ్లిస్తామంటే అడ్డుకుంటారా?  
- ఆ ప్రాంతంలో ఒక్క సామాజికవర్గం మాత్రమే ఉండాలా?  
- రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధిలో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభివృద్ధి వికేంద్రీకరణకు నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని వార్తలు