రుణాల రీషెడ్యూల్కు రిజర్వ్ బ్యాంక్ అంగీకారం

8 Jul, 2014 19:28 IST|Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో రైతుల రుణాల రీ షెడ్యూల్కు రిజర్వ్ బ్యాంక్ అంగీకరించిందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. దీనివల్ల కొత్త రుణాలు మంజూరు చేయడానికి సమస్య ఉండదని చెప్పారు.

ఎంతమేర రీషెడ్యూల్ చేశారన్న విషయం లిఖిత పూర్వక ఆదేశాలు వచ్చాక తెలుస్తుందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతుల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా అమలు చేయకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.

మరిన్ని వార్తలు