భారీవర్షాలతో నిండుగా జలాశయాలు

6 Sep, 2014 16:41 IST|Sakshi
శ్రీశైలం ప్రాజెక్టు ఫైల్ ఫొటో

హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు వచ్చి చేరడంతో జలాశయాలలో భారీ స్థాయిలో నీరు చేరింది. శ్రీశైలం జలాశయంలో  వరద ఉధృతి కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 884.90 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో 1.21 లక్షలు, ఔట్‌ఫ్లో 1.5 లక్షల క్యూసెక్కులుగా ఉంది.

 శ్రీకాకుళం జిల్లా వంశధార గొట్టా బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఇన్‌ఫ్లో 87 వేల క్యూసెక్కులుగా ఉంది. కొత్తూరు మండలం మాతల వద్ద రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. ఒడిశా-ఆంధ్రాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.గొట్టం బ్యారేజి ఫైల్ ఫొటో

కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ  వర్షాల కారణంగా మహదేవ్‌పూర్ మండలంలోని పెద్దంపేట, పంకెన, సర్వాయిపేట వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 16 అటవీ గ్రామాలకు  రాకపోకలు నిలిచిపోయాయి.

నిజామాబాద్ జిల్లాలోని  శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుకు స్వల్పంగా వరద నీరు వచ్చి చేరింది.  ఇన్‌ఫ్లో 4 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 1,069 అడుగులకు చేరింది.ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు.
**

మరిన్ని వార్తలు