ఇసుక మాఫీయాపై కఠిన చర్యలు తప్పవు

5 May, 2019 14:11 IST|Sakshi

సాక్షి, కృష్ణా: విజయవాడ సమీపంలో కృష్ణా నదిలో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు స్పందించారు. నది గర్భంలో ఇసుక తవ్వకాలు జరిగాయని అధికారులు నిర్థారించారు. ఇది జాతీయ హరిత ట్రిబ్యునల్‌ నింబంధనల ఉల్లంగనేనని, ఇసుక తవ్వకాలను తాము ఎవరికీ ఏలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టంచేశారు. నదిలో అక్రమంగా దీవులను సృష్టించిన వారిపై చర్యలు తప్పవన్నారు. అక్రమణదారులపై తప్పకుంటా కఠిన చర్యలు తీసుకుంటామని, అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న వారి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఒక డోజర్‌ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమ ఇసుక తవ్వకాలపై పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు రెవెన్యూ సిబ్బంది తెలిపింది.

మరిన్ని వార్తలు