తమిళనాడులో ఉద్రిక్తతల అంచనాకు ఆర్టీసీ అధికారులు

16 Apr, 2015 08:04 IST|Sakshi

చిత్తూరు: చిత్తూరు నుంచి తమిళనాడు బస్సు సర్వీసుల పునరుద్ధరణ కోసం ఆర్టీసీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీనిలో భాగంగా శేషాచలం అడువుల్లో తమిళ కూలీల ఎన్కౌంటర్ను నిరసనగా తమిళనాడులో నెలకొన్న ఉద్రిక్తతలను అంచనా వేయడానికి ఆర్టీసీ అధికారులు తమిళనాడు వెళ్లనున్నారు. అక్కడ తిరువన్నామలై, రాయవేలూరు, ధర్మపరి ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను గమనించి తర్వాత బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని ఆర్టీసీ భావిస్తోంది.

ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆర్టీసీకి తమిళనాడుకు సర్వీసులను రద్దు చేయడంతో పెద్ద మొత్తంలో నష్టం వాటిలినట్టు అంచనా..ఈ నష్ట నివారణకి తమిళనాడు అధికారులతో ఏపీఎస్ఆర్టీసీ మంతనాలు జపినా వారి నుంచి సరైన హామీ రాలేదు. దీంతో స్వయంగా ఆర్టీసీనే చొరవ తీసుకొని బస్సు సర్వీసుల పునరుద్ధరణ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఇదిలా ఉండగా,  శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు