రన్ ఫర్ యూనిటీ

16 Dec, 2013 02:54 IST|Sakshi

కరీంనగర్ స్పోర్ట్స్, న్యూస్‌లైన్ :  దేశ సమగ్రతకు విద్యార్థులు, యువత పాటుపడాలని, అదే తమ సంకల్పం కావాలని రిటైర్డ్ ఐజీ సీహెచ్.గోపినాథ్ సూచించారు. ఉక్కుమనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన 2కే రన్‌ను నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోపినాథ్ మాట్లాడుతూ దేశ సమగ్రతను కాపాడేందుకు యువత సిద్ధం కావాలన్నారు. హైదరాబాద్‌కు దేశవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చింది పటేలేనని గుర్తు చేశారు. నరేంద్రమోడీ ఆశయ సాధనలో భాగంగా పటేల్ విగ్రహానికి ప్రతిఒక్కరూ తమవంతుగా ముందుకురావాలన్నారు. ఏకతా ట్రస్టు చైర్మన్ బుస్స శ్రీనివాస్ పటేల్ సేవలను విద్యార్థులకు వివరించారు.
 
 అనంతరం నిర్వహించిన 2కేరన్‌లో స్వాతంత్య్ర సమరయోధులు బోయినపల్లి వెంకటరామారావు, దారం నాగభూషణం, వీహెచ్‌పీ ప్రాంతీయ అధ్యక్షుడు సీహెచ్ జగన్మోహన్ రావు, జిల్లా ఒలంపిక్ సంఘం బాధ్యులు గసిరెడ్డి జనార్దన్ రెడ్డి, తుమ్మల రమేశ్‌రెడ్డి, జేఏసీ చైర్మన్ వెంకటమల్లయ్య, కిసాన్ మోర్చ జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జుల రామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షులు మీస అర్జున్‌రావు, నాయకులు ఎడవెల్లి విజయేందర్ రెడ్డి, ఏకతా ట్రస్టు బాధ్యులు కరండ్ల మధుకర్, అంతర్జాతీయ వికలాంగ క్రీడాకారుడు అంజనారెడ్డి, బీజేపీ నగర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్మోహన్‌రావు, కన్నం అంజయ్య, కొత్త శ్రీనివాస్ రెడ్డి, మహిళా మోర్చ నాయకులు గాజుల స్వప్న, సుజాతారెడ్డి, ప్ర సన్న, ప్రజ్ఞభారతి అధ్యక్షుడు ఎలగందుల సత్యనారాయణ, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు హరికిష న్, బీజేవైఎం నాయకులు కీర్తి మధుకర్, మంచి కట్ల కిశోర్, వివిధ విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
 
 ఉత్సాహంగా రన్
 రన్‌ఫర్ యూనిటీలోభాగంగా ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగిన 2కే రన్ ఉత్సాహంగా సాగింది. కళాశాల మైదానం వద్ద ప్రారంభమైన రన్.. తెలంగాణ చౌక్, ఆర్టీసీ బస్టాండ్, తెలంగాణతల్లి విగ్రహం, కమాన్ చౌరస్తా మీదుగా తిరిగి మైదానానికి చేరుకుంది.
 

మరిన్ని వార్తలు