భవిష్యత్ బ్యాంకింగ్ రంగానిదే

24 Nov, 2013 05:01 IST|Sakshi

తిరుచానూరు, న్యూస్‌లైన్:  భవిష్యత్ బ్యాంకింగ్ రంగానిదేన ని ఎస్వీయూ వీసీ ప్రొఫెసర్ డబ్ల్యూ.రాజేంద్ర స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన శ్రీ సాయి గురురాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో శనివారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ‘బ్యాంకింగ్ రం గంలో బ్యాంకు ఉద్యోగాలు సాధించడం ఎలా’ అంశంపై ఉచిత అవగాహన సద స్సు జరిగింది.

ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్ రాజేంద్ర హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆయన మా ట్లాడుతూ రానున్న కాలంలో బ్యాంకింగ్ రంగంలో ఎనలేని ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. శ్రీసాయి గురురాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో శిక్షణ పొం దిన విద్యార్థులు సుమారు 10 వేల మం ది బ్యాంకింగ్ రంగంలో వివిధ హోదా ల్లో స్థిరపడడం అభినందనీయమన్నా రు. కోచింగ్ సెంటర్ చైర్మన్ దస్తగిరిరెడ్డి మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగం మిన హా ఇతర రంగాలలో ఉద్యోగావకాశాలు తగ్గుముఖం పడుతున్నట్లు పేర్కొన్నా రు.

ఇలాంటి సమయంలో విద్యార్థులు సరైన నిర్ణయం తీసుకుని బ్యాంకింగ్ రంగం వైపు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు సాధించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు, సలహాలను కోచింగ్ సెంటర్ ఎండీ పీ.మౌలాలిరెడ్డి వివరించారు. అంతకుముందు కోచింగ్ సెంటర్ రూపొందించిన పుస్తకం, సీడీని ఆవిష్కరించారు. అలాగే విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కోచింగ్ సెంటర్ అకడమిక్ అడ్వైజర్ శౌరిరెడ్డి, మహతి ఏఈ సదాశివం పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు