15న సాక్షి స్పెల్ బీ-2013

14 Dec, 2013 04:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ :
 సాక్షి ఇండియా స్పెల్ బీ-2013 రెండో రౌండ్ పరీక్ష ఈనెల 15న జరుగనుంది. మొదటి రౌండ్‌లో అర్హత సాధించిన వారు రెండో రౌండ్‌లో ప్రవేశించనున్నారు. 8 కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగనుంది.
 ఐరీస్ వరల్డ్ స్కూల్ హైదరాబాద్ రోడ్ కరీంనగర్, రామకృష్ణ స్కూల్ నియర్ ఎన్‌ఎస్‌టీఎల్ గేట్ విశాఖపట్నం, లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ నల్గొండ, రెయిన్‌బో స్కూల్ స్టేషన్‌రోడ్ మహబూబ్‌నగర్, ది ఫ్యూచర్ కిడ్స్ కొవలగొయ్య రోడ్ రాజమండ్రి, నలందా విద్యాలయం పెన్నమనేని పాలిక్లినిక్ ఎదురుగా విజయవాడ, గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియం కడప, మెరిడిన్ స్కూల్ మాదాపూర్ హైదరాబాద్ కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
 
 కేటగిరీ-1కు ఉదయం 12:30 గంటల నుంచి 1 గంట వరకు, కేటగిరీ-2కు 2:30 గంటల నుంచి 3 గంటల వరకు, కేటగిరీ-3కు 4:30 గంటల నుంచి 5 గంటల వరకు, కేటగిరీ-4కు ఉదయం 10:30 గంటల నుంచి 11 గంటల వరకు పరీక్ష ఉంటుంది. విద్యార్థులు స్కూల్ యూనిఫారంలో రావాలి. మొదటి రౌండ్‌లో ఇచ్చిన ప్రవేశ పత్రం, పెన్ను, పెన్సిల్, ప్యాడ్ వెంట తెచ్చుకోవాలి.

మరిన్ని వార్తలు