ఏడుగురు మత్స్యకారుల గల్లంతు

25 Jun, 2015 02:50 IST|Sakshi

పిఠాపురం : ఎప్పుడు వెళ్లేదే కదా ఎలాగైనా వచ్చేస్తారన్న నమ్మకంతో ఇంత హడావిడి జరుగుతున్నా తమ వారి కోసం ఎవరికీ చెప్పకుండా ఉండిపోయారు వారంతా. కానీ అందరూ తిరిగొచ్చారు. వీరి జాడమాత్రం పది రోజులైనా లేకుండా పోయింది. దీంతో ఆందోళన కట్టలు తెంచుకుంది ఆ మత్స్యకార కుటుంబాల్లో. కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు కొత్తపట్నానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంపై చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యారు. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఈ నెల 16న కొత్తపట్నానికి చెందిన పట్టా సూర్యారావు ఫైబర్ బోటుపై అతడితో పాటు అదే గ్రామానికి చెందిన చక్కా సూరిబాబు, చక్కా నాగేశ్వరరావు, పట్టా చంద్రరావు, పట్టా ప్రభుదాస్, పాత్రి దావీదు, సూర్యమళ్ల వెంకటరమణ చేపల వేటకు వెళ్లారు.
 
 వీరితో పాటు వెళ్లిన బోట్లన్నీ బుధవారం నాటికి తిరిగొచ్చాయి. వీరి బోటు మాత్రం రాక పోవడంతో మత్స్యకారుల కుటుంబాల వారు ఆందోళనకు గురై మీడియాకు సమాచారం అందించారు. వేటకు వెళ్లిన రోజు ఉదయం 11 గంటల వరకూ సెల్‌ఫోన్ పనిచేసిందని, మత్స్యకారులంతా క్షేమంగా ఉన్నట్టు చెప్పారన్నారు. అప్పటి నుంచి ఫోన్ పనిచేయడం లేదన్నారు. తమవారు తిరిగొస్తారన్న నమ్మకంతో ఉన్నామని, అందుకే ఎవరికీ చెప్పలేదని బాధిత కుటుంబాల వారు చెబుతున్నారు.
 
 బోటులో ఇంజన్ పాడై, తెరచాప సాయంతో వచ్చేందుకు పది రోజులుగా కష్టపడుతున్నారేమోనని భావించామన్నారు. మత్స్యకారుల జాడ లేకపోవడంతో వారికేమైనా ప్రమాదం సంభవించిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెల్‌ఫోన్ చార్జింగ్ అయిపోయి ఉండవచ్చని, అవి పనిచేయకపోవచ్చనే వాదనలూ వినిపిస్తున్నాయి. బోటు యజమాని సహా వీరంతా మూడు కుటుంబాలకు చెందిన వారే.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గంటపాటు లిఫ్టులో నరకం

పేదల ఇంట 'వెలుగు'

కులం పేరుతో దూషించినందుకు ఐదేళ్ల జైలు

చంద్రబాబుపై సెటైర్లు.. సభలో నవ్వులు..!

చేయి చేయి కలిపి...

పని చేస్తున్నసంస్థకే కన్నం

స్కూటీ.. నిజం కాదండోయ్‌

బస్సుల కోసం విద్యార్థుల నిరసన

రెవెన్యూలో అవినీతి జలగలు.!

అల్లుడిని చంపిన మామ

అక్రమ కట్టడాల తొలగింపుపై చర్చించడమా?

చినుకు పడితే చెరువే..

బాపట్లవాసికి జాతీయ అవార్డు!

అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం: బొత్స

ఆ వంతెన మొత్తం అంధకారం

మేఘాలే తాకాయి.. ‘హిల్‌’ హైలెస్సా..

ఏపీలో పెట్టుబడులకు పలు సంస్థల ఆసక్తి

చీకటిని జయించిన రాజు

విద్యార్థి మృతి.. పాఠశాల నిర్లక్ష్యమే కారణం

ఆ‘ఘనత’ చంద్రబాబుదే..!

దారి మరిచాడు..ఆరు కిలోమీటర్లు నడిచాడు

విశాఖలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు?

అవనిగడ్డలో పెరిగిన పాముకాటు కేసులు!

కాటేసిన కరెంట్‌ తీగ

అమ్మ ఊరెళ్లిందని చెప్పడంతో..

ఆక్వా రైతులకు రూ. 1.50కే యూనిట్‌ విద్యుత్‌

నీట్‌లో సత్తా చాటిన సందీప్‌

రిసార్టులు, పార్కుల్లో అలంకరణకు ఈత చెట్లను..

ఆర్థిక హత్య.. ఆపై క్షుద్ర డ్రామా!

పద్నాలుగేళ్ల పోరాటం.. బతికేందుకు ఆరాటం 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..