నాగరాజా.. పాలు తాగు రాజా!

8 Feb, 2019 07:53 IST|Sakshi

తూర్పుగోదావరి, రాజానగరం: ‘పుట్టలోని నాగన్న లేచి రావయ్యా.. బొజ్జ నిండా పాలు తాగయ్యా..’ అన్నట్టుగా సంపత్‌నగరంలో ఓ సర్పానికి గ్రామస్తులు పాలు పోసి పూజలు చేస్తున్నారు. ఆ నాగరాజు జనానికి ఒక టైమ్‌ కూడా కేటాయించారు. గ్రామానికి చెందిన సాకా శ్రీను పొలంలో దర్శనమిస్తున్న ఈ వింతను చూసేందుకు పరిసర గ్రామాల నుంచి కూడా జనం తండోపతండాలుగా వస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే.. పొలంలోని ఓ పాముల పుట్ట నుంచి ఒక పాము 15 రోజులుగా రోజూ బయటకు వస్తోంది. దానికి జనం పాలు పోసి, పూజలు చేస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం పదిగంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పాము జనానికి దర్శనమిస్తోంది. ఆ సమయంలో పాలు పోస్తే అది తాగుతోందని స్థానికులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు