వీవీ ప్యాట్‌లో తప్పు చూపితే ?

28 Mar, 2019 09:57 IST|Sakshi
వీవీ ప్యాట్‌

సాక్షి, అనంతపురం అర్బన్‌: సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా వీవీప్యాట్‌లను (ఓటర్‌ వెరిఫైడ్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌) వినియోగిస్తున్నారు. ఈవీఎంలో ఓటరు తాను వేసిన గుర్తుకే ఓటు పడిందా లేదా అనే అనుమానం వచ్చినప్పుడు వీవీప్యాట్‌ ద్వారా పరిశీలించుకోచ్చు. తాను వేసిన గుర్తు ఒకటైతే వీవీప్యాట్‌లో మరో గుర్తుకు పడినట్లు తప్పు ప్రింట్‌ చూపిస్తే దానిని రాంగ్‌ ప్రింట్‌ ఆఫ్‌ వీవీప్యాట్‌ పేపర్‌ స్లిప్‌ అంటారు. ఇలాంటి సందర్భంలో పీఓలు ఏం చేయాలని అనేదానిపై ఓటరు అవగాహన కలిగి ఉండాలి. 

తప్పు ప్రింట్‌ చూపెడితే.. 

  • ప్రిసైడింగ్‌ అధికారి రూల్‌ 49ఎంఏ ప్రకారం చర్యలు తీసుకోవాలి. 
  •  హ్యాండ్‌ బుక్‌లోని ఆనెక్సర్‌–15 ప్రకారం ఫిర్యాదు చేసిన ఓటరు వద్ద డిక్లరేషన్‌ను ప్రిసైడింగ్‌ అధికారి తీసుకోవాలి. 
  •  పోలింగ్‌ ఏజెంట్ల సమక్షంలో 17 ఎలో ఓటరు వివరాలు మరోసారి ఎంటర్‌ చేయాలి. 
  •  కంట్రోల్‌ యూనిట్‌ నుంచి ఓటును విడుదల చేయాలి. ఏజెంట్ల సమక్షంలో ప్రిసైడింగ్‌ అధికారి వీవీప్యాట్‌లో వచ్చిన స్లిప్‌ను పరిశీలించాలి. 
  •  ఓటరు ఫిర్యాదు నిజమని తేలితే... ప్రిసైడింగ్‌ అధికారి పోలింగ్‌ను ఆపేసి రిటర్నింగ్‌ అధికారికి తెలియజేయాలి. 
  •  ఓటరు ఫిర్యాదు తప్పని తేలితే 17 ఎలో ఆ ఓటరు రెండోసారి రాసిన వివరాలు రిమార్క్‌ కాలమ్‌లో ఓటరు చేసిన ఫిర్యాదు తప్పని రాయాలి. 
  •  17 సి అనగా పోలైన ఓట్ల వివరాలు తెలిపే ఫారంలోని మొదటి భాగంలో (పార్ట్‌–1) ఆ వివరాలు నమోదు చేయాలి. 

ఈవీఎంలు, వీవీప్యాట్‌లు పనిచేయకపోతే ..

  •  పోలింగ్‌ సమయంలో ఈవీఎంలు, వీవీప్యాట్‌లు పనిచేయకపోతే.. వాటి స్థానంలో రిజర్వ్‌లోని వాటిని ఏర్పాటు చేయాలి. 
  •  కొత్త ఈవీఎం, వీవీప్యాట్‌లో మళ్లీ మాక్‌పోల్‌ నిర్వíßహించాలి. డిక్లరేషన్‌ రాయాలి (సింగిల్‌ ఓటు) 
  • ర్క్‌డ్‌ ఓటరు వస్తే... 
  •  ప్రిసైడింగ్‌ అధికారి వద్ద ఓటరు జాబితాకు సంబంధించి వర్కింగ్‌ కాపీలు, మార్క్‌డ్‌ కాపీలు ఉంటాయి. అందులో ఆబ్సెంట్, షిప్టెడ్, డెత్‌ (ఏఎస్‌డీ) జాబితాలో ఉన్న ఓటర్లను మార్క్‌ చేసి   ఉంటారు. 
  •  మార్క్‌డ్‌ ఓటరు ఓటు వేయడానికి వస్తే ప్రిసైడింగ్‌ అధికారి ఆ ఓటరు తెచ్చిన గుర్తింపుతో ఓటరు జాబితాలోని వివరాలను సరిచూడాలి. 
  •  నిజమైతే 17ఎలో ఆ ఓటరు సంతకంతో పాటు వేలిముద్ర తీసుకోవాలి. ఓటు వేసేందుకు అనుమతించాలి. 
  •  ఏఎస్‌డీ జాబితా నుంచి ఓటు వేసిన వారి వివరాలతో ఒక రికార్డు తయారు చేయాలి.  
మరిన్ని వార్తలు