శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

2 Nov, 2013 05:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: కార్తీక మాసం సందర్భంగా రాష్ట్రంలోని శైవక్షేత్రాలను దర్శించుకునే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ సి.వినోద్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కరీంనగర్‌లోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి, కాళేశ్వరం ముక్తేశ్వరస్వామి, వరంగల్‌లోని వే యి స్తంభాల గుడి రుద్రేశ్వరస్వామి, పాలకుర్తి సోమనాథ ఆలయాలకు ప్రత్యేక బస్సులు నడుపుతారు. కార్తీక మాసంలోని ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు  సూపర్ లగ్జరీ బస్సులు హైదరాబాద్ నుం చి బయలుదేరి సోమవారం రాత్రికి తిరిగి హైదరాబా ద్ చేరుకుంటాయి. టిక్కెట్ ధర రూ.900.
 
 పంచారామాల దర్శనం..: గుంటూరు జిల్లా అమరావతి, పశ్చిమ గోదావరి జిల్లా  భీమవరం, పాల కొల్లు, తూర్పు గోదావరి జిల్లాలోని ద్రాక్షారామం, సామర్లకోటకు వెళ్లేందుకు కార్తీక మాసంలోని ప్రతి ఆదివారం, ఆ నెలలోని పౌర్ణమికి ఒక రోజు ముందు సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. దర్శనం అనంతరం మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంటాయి. టిక్కెట్ ధర  రూ.1500. ప్రయాణికులు తమ సీట్లను మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీ బస్‌స్టేషన్, దిల్‌సుఖ్‌నగర్ బస్‌స్టేషన్, హైదరాబాద్‌లోని అన్ని అధీకృత టికెట్ బుకింగ్ కేంద్రాలలో రిజర్వ్ చేసుకోవచ్చు.
 

>
మరిన్ని వార్తలు