అడవిలో హల్‌చల్

19 Oct, 2013 04:55 IST|Sakshi
అడవిలో హల్‌చల్

మన్ననూర్, న్యూస్‌లైన్: ఆర్థిక ఇబ్బందులు తాళలేక నల్లమల అడవిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడుతున్నామంటూ ఓ అపరిచిత వ్యక్తి నుంచి పోలీసులకు వచ్చిన ఫోన్‌కాల్ కలకలం సృష్టించింది. పోలీసులను ఉరుకులు పరుగులు పె ట్టించి ముచ్చెమటలు పట్టించింది. పోలీ సులు, ఫారెస్ట్‌సిబ్బంది అడవిలో జల్లెడపట్టినా వారి ఆచూకీ లభించింది. చివరికి చిన్న క్లూ ద్వారా వారి పట్టుకోవడం కథ సుఖాంతమైంది. ఈ సంఘటన  మన్ననూర్ అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. అమ్రాబాద్ ఎస్‌ఐ రవీందర్ కథనం మేరకు..
 
 ఏం జరిగిందంటే..
 ‘హైదరాబాద్‌కు చెందిన మేము చెక్‌పోస్టు వద్ద కారు ఉంచి నా భార్య, నేను కుటుంబ సమస్యలు, అప్పులు, వ్యక్తిగత కారణాలతో బతుకుమీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవడానికి నల్లమల అడవిలోని వెళుతున్నాం..’ అంటూ ఓ అపరిచిత వ్యక్తి పోలీసులకు ఫోన్‌చేసి కట్ చేశాడు. దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆరాతీశారు. ఉదయం 6 గంటలకు అచ్చంపేట ఆర్టీసీ డిపో బస్సు ఎక్కి శ్రీశైలం వైపు వెళ్లారని స్థానిక హోటల్ నిర్వాహకులు తెలిపారు. వారు విడిచి వెళ్లినట్టు భావిస్తున్న (ఏపీ 09 బికె 4423) స్పార్క్ కారు డోర్లకు తాళం తీసి ఉండటంతో పోలీసులు తెరిచి చూశారు. అందులో వివిధ బ్యాంకులకు చెందిన సుమారు పది ఏటీఎం కార్డులు ఉన్నట్లు గుర్తించారు. వేర్వేరు పేర్లతో ఆర్సీ, డ్రైవింగ్ లెసైన్స్, కారు కాగితాలు, ల్యాప్‌టాప్ మరికొన్ని వస్తువులను కనుగొన్నారు. సాయంత్రం వరకు వివిధ ప్రాంతాల్లో ఫారెస్టు సిబ్బంది వెతికినా వారి ఆచూకీ మాత్రం లభించలేదు.
 
 చిక్కారు ఇలా..
 హైదరాబాద్ నుంచి వచ్చిన పోలీసులు, స్థానికులు కలిసి ఒకేఒక ఆధారంగా భావించి తమకు ఫోన్‌వచ్చిన సెల్: 9701277983 ద్వారా రంగంలోకి దిగారు. అదేవిధంగా డ్రైవింగ్ లెసైన్స్‌పై అనిల్‌కుమార్ తండ్రి గోపాలకృష్ణగౌడ్ ఏడ్‌చెర్ల నిజమాబాద్ జిల్లా, ఆర్‌సీ పేపర్‌పై తాటికొండ శ్రీనివాసాచారి తండ్రి సద్గురాచారి అని లభ్యమైన వివరాలు పోలీసులకు మరింత తోడయ్యాయి. దీంతో మొబైల్ ట్రాకర్ ద్వారా పై నెంబర్ నుంచి వచ్చిపోయే ఫోన్‌కాల్స్‌ను పసిగట్టారు. చివరికి వారిని శ్రీశైలం క్షేత్రంలోని నందిమండపం సర్కిల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు శ్రీనివాసాచారి(31), శ్రావణి(29)గా గుర్తించారు.
 
 వారు గతకొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవాలని భావించి..నల్లమల అటవీప్రాంతానికి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలిం ది. నేరుగా ఆర్టీసీ బస్సులో వచ్చిన వారు శుక్రవారం మధ్యాహ్నం పాతాళగంగలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నా అక్కడ వీలుపడకపోవడంతో పలుప్రాంతాలు తిరిగారు. ఆ తరువాత శ్రీశైలం క్షేత్ర సమీపంలోని ఇష్టకామేశ్వరిని దర్శనం చేసుకున్నారు. రాత్రి పోలీసులు వారిని పట్టుకుని హైదరాబాద్‌కు తరలించడంతో కథ సుఖాం తమైంది. దీంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.
 

మరిన్ని వార్తలు