గుడిమెట్లలో ‘సుజనా’ కుటుంబీకుల పరిశ్రమ

11 Sep, 2014 09:42 IST|Sakshi
గుడిమెట్లలో ‘సుజనా’ కుటుంబీకుల పరిశ్రమ

అమరావతి, అచ్చంపేట పరిసరాల్లో కొత్త రాజధాని ఉంటుందనే ప్రచారం ప్రభుత్వ వర్గాల్లో ఊపందుకుంది. సీఎం బాబు సన్నిహితుడు, ఎంపీ సుజనాచౌదరి కుటుంబ సభ్యులకు చెందిన సత్యవతి మినరల్స్ అండ్ మెటల్స్ కంపెనీ.. గుడిమెట్లలో టైటానియం డైయాక్సైడ్ పరిశ్రమ ఏర్పాటు కోసం అవసరమైన భూ సేకరణకు అధికారిక ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇటీవలే ప్రజాభిప్రాయ సేకరణ కూడా ముగిసింది. ఇక్కడ 132 ఎకరాల భూమి కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్న ప్రాంతం వెనుకే అటవీ భూములు ఉండటం కూడా ఈ సంస్థకు కలిసొస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక్కడికి కిలోమీటరు దూరంలోని కృష్ణా నుంచి నీటి కేటాయింపులు చేసుకునే యోచనతోనే ఈ ప్రాంతా న్ని ఎంచుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీకి చెందిన మరో ముఖ్య నేత సన్నిహిత సంస్థగా భావిస్తున్న ఒక కంపెనీ వెయ్యి మెగా వాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కర్మాగారం స్థాపన కోసం గుడిమెట్ల సమీపంలోని ఉస్తిపల్లిలో 562 ఎకరాల భూమి కోరుతూ 2011లో దాఖలు చేసిన దరఖాస్తుకు మళ్లీ ప్రాణం వచ్చింది.

 

అధికారిక ప్రక్రియను వేగంగా పూర్తిచేసి సదరు కంపెనీకి కృష్ణా నదిని ఆనుకునే ఉన్న ఈ కొండ ప్రాంతాన్ని కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతోపాటు టీడీపీకి చెందిన అనేక మంది నేతలు అమరావతి, అచ్చంపేట, మంగళగిరి, క్రోసూరు, గుడిమెట్ల, నందిగామ, జగ్గయ్యపేట మార్గాల్లో భూముల కొనుగోలుకు రంగంలోకి దిగారు.
 
 

మరిన్ని వార్తలు