బొండా ఉమపై కేసు ఎందుకు పెట్టరు?

13 Apr, 2019 12:07 IST|Sakshi
సుమశ్రీ

పోలీసులను ఆశ్రయించిన సుమశ్రీ

సాక్షి, విజయవాడ: తన కూతురు మరణానికి కారుకులైన తన మాజీ భర్త మాదంశెట్టి శివకుమార్, ఎమ్మెల్యే బొండా ఉమమహేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని సుమశ్రీ అనే మహిళ కోరారు. ఈ మేరకు శనివారం సూర్యారావుపేట పోలీసులను ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలిచ్చిన ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈనెల 15 వరకు గడువు ఉందని, ఈలోపే కేసు నమోదు చేస్తామని ఆమెకు పోలీసులు హామీయిచ్చారు.

మాదంశెట్టి శివ, బొండా ఉమపై రెండేళ్ల క్రితం ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో ఆమె హైకోర్టు తలుపు తట్టారు. ఈనెల 15లోపు మాదంశెట్టి శివ, బొండా ఉమాపై కేసు నమోదు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. కాగా, సుమశ్రీ కుమార్తె సాయిశ్రీ 2017లో క్యాన్సర్‌తో చనిపోయింది. పాప చనిపోతే ఆస్తి అంతా తండ్రికి వస్తుందన్న క్రూరమైన ఆలోచనతో శివకుమార్.. సాయిశ్రీకి వైద్యం చేయిందని సుమశ్రీ ఆరోపించారు. (‘నాన్నా! నన్ను బతికించవూ ప్లీజ్‌!’)

మరిన్ని వార్తలు