నేడు ఏపీలో ఆకస్మిక తనిఖీలు

13 Dec, 2014 07:14 IST|Sakshi
నేడు ఏపీలో ఆకస్మిక తనిఖీలు

విజయవాడ:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శనివారం నుంచి ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని అర్హులందరికీ పింఛన్లు ఇస్తున్నామన్నారు. పింఛన్లు తదితర అంశాలకు సంబంధించి తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు.

 

విజయవాడ నగరాన్ని బ్యూటీఫుల్ నగరంగా తయారు చేస్తామన్నారు. రాజధానిని వరల్డ్ క్లాస్ సిటీగా మారుస్తామన్నారు. విశాఖలో పంట నష్టపోయిన రైతులందరికీ నష్ట పరిహారం అందజేశామని బాబు తెలిపారు.

మరిన్ని వార్తలు