మరో స్వైన్‌ఫ్లూ కేసు నమోదు

5 Nov, 2018 11:34 IST|Sakshi

ఓడీ చెరువు మండలంలోని మహిళకు లక్షణాలు

మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలింపు

అనంతపురం న్యూసిటీ: జిల్లాలో రెండో స్వైన్‌ఫ్లూ్ల కేసు నమోదైంది. ఓడీ చెరువు మండలం కొండకమర్ల గ్రామానికి చెందిన 40 ఏళ్ల మహిళ శనివారం ఆస్పత్రిలో చేరగా...ఆదివారం ఆ మహిళను పరీక్షించిన వైద్యులు స్వైన్‌çఫ్లూగా నిర్ధారించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికే నగరంలోని కళ్యాణదుర్గం బైపాస్‌ సమీపంలో నివాసముంటున్న ఓ మహిళ స్వైన్‌ఫ్లూ్ల లక్షణాలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

ఆందోళనలో ఆస్పత్రి సిబ్బంది
స్వైన్‌ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్న మహిళ శనివారం ఆస్పత్రిలో చేరగా...వైద్యులు, స్టాఫ్‌నర్సులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే సేవలందించారు. ఆమెకు స్వైన్‌çఫ్లూ్ల ఉందని తేలడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఫ్లూవాక్‌ వ్యాక్సిన్, ఎన్‌95 మాస్క్‌లు అందుబాటులో లేకపోయినా వైద్యం చేశామనీ, స్వైన్‌ఫ్లూ తమకు ఎక్కడ సోకుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు.  

మరిన్ని వార్తలు