తాడిపత్రి రూరల్‌ సీఐపై వేటు

7 Apr, 2019 17:14 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ అధికారులపై చర్యలు కొనసాగుతున్నాయి. తాజాపై మరో సీఐపై బదిలీ వేటు పడింది. అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్‌ సీఐ నారాయణరెడ్డిని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆయన స్థానంలో శరత్ చంద్రను తాడిపత్రి సీఐగా నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఆదేశాలిచ్చారు.

ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించడం లేదన్న ఆరోపణలతో చిత్తూరు జిల్లా మదనపల్లి రెండో పట్టణ సీఐ సురేశ్‌కుమార్‌పై ఇప్పటికే బదిలీ వేటు పడింది. అధికార టీడీపీ ఎన్నికల ప్రచార సభలో కోడ్‌ ఉల్లంఘన జరిగిన విషయాన్ని రాజంపేట పార్లమెంట్‌ పరిశీలకులు నవీన్‌కుమార్‌ గుర్తించి కేసు నమోదు చేయమని చెప్పినా సురేశ్‌కుమార్‌ పెడచెవిన పెట్టారు. ఏకపక్షంగా వ్యవహరించిన సురేశ్‌ను ఎన్నికల విధుల నుంచి ఆయన స్థానంలో అనంతపురం పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో సీఐగా పనిచేస్తున్న పి. సుబ్బారాయుడును నియమిస్తూ గోపాలకృష్ణ ద్వివేది ఆదేశాలిచ్చారు. (చదవండి: తాడిపత్రిలో జేసీ బ్రదర్స్‌కు ఎదురుదెబ్బ)

మరిన్ని వార్తలు