‘బంగారు’ స్వచ్ఛభారత్

24 Jan, 2015 05:47 IST|Sakshi
‘బంగారు’ స్వచ్ఛభారత్

ఒక గ్రాము బంగారంతో స్వచ్ఛభారత్ లోగోను తయారు చేసి అబ్బురపరిచాడు తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన స్వర్ణకారుడు తాళాబత్తుల బ్రహ్మాజీ.  రెండు అంగుళాల పొడవు, 1.5 అంగుళాల వెడల్పుతో ఈలోగోను తయారుచేశారు. స్వచ్ఛభారత్ లోగోలో ఉండే చరఖాను  550 మిల్లీ గ్రాములతో, కళ్లజోడును 100 మిల్లీగ్రాములతో, డస్ట్‌బిన్‌ను 100 మిల్లీగ్రాములతో, చీపురును 200 మిల్లీ గ్రాములతో, చేటను 50 మిల్లీగ్రాములతో అతి సూక్ష్మంగా సృష్టించారు. ఈ లోగోను తయారుచేసేందుకు 15 రోజులు పట్టిందని బ్రహ్మాజీ చెప్పారు. దీనిని త్వరలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి బహూకరిస్తానని తెలిపారు. బ్రహ్మాజీ ఇంతకుముందు బంగారం, వెండితో 25 సూక్ష్మ కళాఖండాలను రూపొందించారు.    
 - అమలాపురం

>
మరిన్ని వార్తలు