రూ.250కే కుళాయి కనెక్షన్‌

2 Jul, 2018 04:54 IST|Sakshi

     కేంద్రం ప్రకటించిన అమృత్‌ పట్టణాల్లో అమలు

      బీపీఎల్‌ కుటుంబాలకు ప్రాధాన్యత

     16 లక్షల ఇళ్లకు ఇచ్చేందుకు ప్రణాళిక

సాక్షి, అమరావతి: పట్టణాల్లోని పేదలకు తక్కువ మొత్తానికి ఇంటికి కుళాయి కనెక్షన్‌ ఇవ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన అమృత్‌ (అటల్‌మిషన్‌ అర్బన్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌) పట్టణాల్లో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రోత్సాహాలు అందుబాటులోకి రానున్నాయి. సాలీనా రూ.500 ఇంటి పన్ను చెల్లించే బీపీఎల్‌ కుటుంబాలకు రూ.250కే కుళాయి కనెక్షన్లు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మున్సిపల్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీలయినంత ఎక్కువ మందికి ఈ కనెక్షన్లు ఇచ్చేందుకు వీలుగా ఆయా పట్టణాల్లో రక్షిత మంచినీటి సరఫరా పథకాలను సిద్ధం చేస్తున్నారు. కనెక్షన్లు తీసుకోవాలంటూ కొన్ని పట్టణాల్లో మున్సిపల్‌ అధికారులు ప్రచారం కూడా ప్రారంభించారు. గ్రేటర్‌ విశాఖలో  బీపీఎల్‌ కుటుంబాల వివరాలను సేకరించి కనెక్షన్లు కోసం దరఖాస్తు చేయాలని అక్కడి అధికారులు సమాచారం కూడా ఇస్తున్నారు.

వచ్చే అక్టోబర్‌లోపు కుళాయి కనెక్షన్లు ఇవ్వడానికి అనువుగా అధికారులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 2015–16లో రాష్ట్రంలోని 31 పట్టణాల్లో కేంద్ర ప్రభుత్వం అమృత్‌ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ పట్టణాల్లో రక్షిత మంచినీరు, భూగర్భ మురుగునీటి సరఫరా పథకాలను చేపట్టేందుకు రూ.2000 కోట్లు విడుదల చేసింది. ఆ పట్టణాల్లో రక్షిత మంచినీటి పథకాల నిర్మాణాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. ఆ నేపథ్యంలోనే కుళాయి కనెక్షన్ల మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దాదాపు 16 లక్షల కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు అనువుగా ఈ పథకాలు చేపట్టారు. తెల్లరేషన్‌ కార్డు కలిగి, సాలీనా రూ.500 ఇంటి పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి.

కనెక్షన్‌ ఇచ్చే సమయంలో పైపులు తదితరాలకు రూ.1000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నందున బీపీఎల్‌ కుటుంబాలు ఎనిమిది వారాల్లో కుళాయి కనెక్షన్‌ డిపాజిట్‌ను చెల్లించాల్సి ఉంటుంది. గ్రేటర్‌ విశాఖలో వచ్చే అక్టోబరులోపు రెండు లక్షల కనెక్షన్లు ఇచ్చేందుకు అనువుగా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు నగరపాలక సంస్ధతోపాటు మున్సిపాల్టీల్లో దరఖాస్తు చేసుకున్న వారికి కనెక్షన్లు మంజూరు చేస్తున్నారు. నరసరావుపేట మున్సిపాల్టీలో దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల్లో కుళాయి అమర్చుతున్నారు.

గుంటూరు జిల్లాలో దాదాపు 60 వేల కనెక్షన్లు ఇచ్చేందుకు అనువుగా రక్షిత మంచినీటి పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఏలూరు, మచిలీపట్నం, నెల్లూరు, అనంతపురం, కాకినాడ పట్టణాల్లోని అధికారులు బీపీఎల్‌ కుటుంబాలు చెల్లిస్తున్న ఇంటిపన్ను రూ.500 నుంచి రూ.750లకు పెంచితే మరి కొన్ని కుటుంబాలకు కుళాయి కనెక్షన్‌ పొందే అవకాశం ఏర్పడుతుందని, ఆ మేరకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పంపారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నాలుగు రోజుల్లోనే రెట్టించిన ఉత్సాహంతో

కిక్కుదిగుతోంది

పోలవరంపై టీడీపీకి మాట్లాడే హక్కు లేదు : మల్లాది

ఫెయిలైనా ' పీజీ' అడ్మిషన్‌ దొరుకుతుంది ఇక్కడ

సహజ నిధి దోపిడీ ఆగేదెన్నడు..?

ఆహా ఏమి రుచి..తినరా మైమరిచి

రెండు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు దగ్ధం

సింగిల్‌ క్లిక్‌తో జిల్లా సమాచారం

కూతకు వెళ్తే పతకం కానీ అడ్డుగా పేదరికం

కొండముచ్చు.. ప్రజెంట్‌ సార్‌

‘అది తప్పుడు ప్రచారం; ప్రజల దృష్టికి తీసుకెళ్లండి’

మారని వైస్‌ చాన్సలర్‌ తీరు!

పోలీసు శాఖలో ప్రక్షాళన దిశగా అడుగులు 

తరిమి కొట్టి.. చెట్టుకు కట్టి..

‘బాబు స్వార్ధం కోసం సభను వాడుకుంటున్నారు’

సారూ.. మా నోట్లో మట్టి కొట్టొద్దు!

ఆక్వా రైతులకు మేత భారం

అవినీతిని సహించేది లేదు..!

అతివేగం; టాటాఏస్‌పై పడిన వోల్వో బస్‌

'అధ్యక్షా.. మమ్మల్ని వెనుకబెట్టారు'

సర్వజనాస్పత్రికి జీవం పోసిన వైఎస్‌ జగన్‌

ఆ పాఠాలు ఉండవిక...

ఎమ్మెల్యే దంపతుల ఆధ్వర్యంలో వరుణయాగం

160 కిలోల గంజాయి స్వాధీనం

పెన్షనర్లకు 27 శాతం ఐఆర్‌

భార్యపై అనుమానంతో..

రైతు పారకు కేరాఫ్‌ వండానపేట

మంగళగిరి ఎయిమ్స్‌ సభ్యుడిగా విజయసాయిరెడ్డి

శభాష్‌ రమ్య!

తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాల నిలిపివేత

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!