ఆశల పల్లకి

15 Jun, 2014 00:32 IST|Sakshi
ఆశల పల్లకి

- మార్కెట్ కమిటీలు, ఆలయ ట్రస్ట్‌బోర్డు పదవులపై కన్నేసిన టీడీపీ నేతలు
- వెయ్యి మందికి పదవీ యోగం
- వేలాది మంది ఆశావహులు

ఏలూరు : నామినేటెడ్ పదవులపై కన్నేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు వాటిని దక్కించుకునేందు కు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మార్కెట్ కమిటీ, ఆలయ ట్రస్ట్‌బోర్డు పదవుల్ని దక్కించుకునేందుకు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దాదాపు పదేళ్లుగా పదవులు లేక అజ్ఞాతవాసం గడిపిన నాయకులు ఇప్పుడు ఆ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో 18 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో అధ్యక్ష, డెరైక్టర్ పదవులు 18చొప్పున మొత్తం 324 ఉన్నారుు. దేవాదాయ శాఖ పరిధిలో 150 ఆలయూలకు ట్రస్టుబోర్డులు ఉన్నారు.

వీటిలో 3నుంచి 9 వరకూ పదవులు ఉంటారుు. సగటున 4 పదవులు ఉన్నాయనుకున్నా 600 మంది నాయకులు, కార్యకర్తలకు నామినేటేడ్ పోస్టులు లభిస్తారుు. ఆ పదవులను పార్టీ నాయకులు, కార్యకర్తలకు అప్పగించడం ద్వారా వారి సేవలను ఉపయోగించుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారు. ఇదే విషయూన్ని రాష్ట్ర మంత్రివర్గం తొలి సమావేశంలో చర్చించడంతోపాటు వెంటనే మార్కెట్ కమిటీ పాలకవర్గాలను, ట్రస్ట్‌బోర్డు కమిటీలను నియమించాలంటూ ఆయా శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు.

ఇప్పటికే ఆ పదవుల్లో ఉన్నవారు గౌరవంగా తప్పుకునేలా చూడాలని, లేదంటే ఆయూ కమిటీలను రద్దు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు తమకు త్వరలోనే పదవీయోగం పట్టబోతోందని మురిసిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయూ పదవులను అనుభవిస్తున్న కాంగ్రెస్ నాయకుల పరిస్థి తి అగమ్యగోచరంగా తయూరైం ది. నామినేటెడ్ పదవుల భర్తీకి త్వరలోనే ఆర్డినెన్స్ రానుందని సమాచారం.

మరిన్ని వార్తలు