తెలంగాణలో టీడీపీ అడ్రస్ గల్లంతే

8 Sep, 2013 23:46 IST|Sakshi
తూప్రాన్, న్యూస్‌లైన్:ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో తెలంగాణను అడ్డుకున్నది తానేనని ఒప్పుకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు, టీడీపీకి తెలంగాణలో స్థానం లేదని గజ్వేల్ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని ఇమాంపూర్ గ్రామ మాజీ సర్పంచ్ బాలపోచయ్యతో పాటు గ్రామానికి చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొండంత బలం చేకూరిందన్నారు. తెలంగాణ విషయంలో టీడీపీ రెండు నాలుకల ధోరణి అవలంబిస్తోందని దుయ్యబట్టారు.
 
 అనంతరం రావె ల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పోతరాజుపల్లిలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ప్రసంగించారు. అనంతరం రావెల్లి, పోతరాజుపల్లి గ్రామాలకు చెందిన సుమారు 150 మంది యువకులు గ్రామ సర్పంచ్ మల్లేశ్ యాదవ్, ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీ పార్టీలోకి ఆహ్వానించారు.  కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్ మహిపాల్‌రెడ్డి, నేతలు విజయభాస్కర్‌రెడ్డి, బాబుల్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, శ్రీశైలం యాదవ్, లక్ష్మీనర్సింలుగౌడ్, కమ్మరి సత్యనారాయణ, పెంటాగౌడ్, రవీందర్‌గుప్త, వెంకట్‌రెడ్డి, నాగరాజుగౌడ్, వెంకటస్వామి, సత్యనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు