పశువుల రీసైక్లింగ్‌కు ఆస్కారమే లేదు 

10 Nov, 2023 03:21 IST|Sakshi

ముందుకొచ్చిన చేయూత లబ్దిదారులకే రుణాలు 

వాళ్లకు నచ్చిన చోట నచ్చిన జీవాల కొనుగోలుకు వెసులుబాటు 

పొరుగు రాష్ట్రాల నుంచి ఒక్క పశువు కూడా కొనలేదు.. రాష్ట్రంలో ఉన్న ప్రతి పశువుకు ఇనాఫ్‌ ట్యాగ్‌ వేశాం 

ఈనాడు కథనానికి పశుసంవర్థక శాఖ ఖండన 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పశువుల రీ సైక్లింగ్‌కు ఏమాత్రం ఆస్కారంలేదని పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ రెడ్నం అమరేంద్రకుమార్‌ స్పష్టంచేశారు. జగనన్న పాల వెల్లువ పథకం కింద వైఎస్సార్‌ చేయూత లబ్ధిదారులు చేసిన పశువుల కొనుగోళ్లలో ఎలాంటి కుంభకోణాలు జరగలేదని గురువారం ఆయన ఒక ప్రక­టనలో వెల్లడించారు.

ఈ స్కీంపై అవగాహనలేకుండా కొన్ని రాజ­కీయ పార్టీల నేతలు ప్రక­టనలు ఇవ్వడం.. వాటి ఆధారంగా కొన్ని పత్రికలు ప్రభు­త్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకుని కనీసం క్రాస్‌చెక్‌ కూడా చేసు­కో­కుండా దుష్ప్రచారం చేయడం సరికాదని ఆయ­నన్నారు. చేయూత పథకం ద్వారా లబ్ధిపొందిన వారిలో ఎవరైతే పాడి పశువుల యూనిట్లు కావాలని దరఖాస్తు చేసు­కున్నారో, వారికి మాత్రమే పశువుల కొను­గోలు కోసం రుణాలు మంజూరు చేశారన్నా­రు.

ఎస్‌ఎల్‌బీసీ సమావేశాల్లో ప్రభు­త్వ­పరంగా చేసిన విజ్ఞప్తి మేరకు బ్యాంకర్లు ముందు­కొచ్చి అర్హులైన ప్రతీ ఒక్కరికీ రుణాలు మంజూరు చేశార­న్నారు. ఈ సమా­వేశాల్లో కానీ, మరెక్క­డా కానీ పశువుల రీసైక్లింగ్‌ చేస్తున్నట్లుగా ఏ ఒక్కరూ ఆరో­పించలేదని అమరేంద్రకుమార్‌ తెలిపారు. 

ప్రభుత్వ ప్రమేయమేమీలేదు..
ఇక లబ్ధిదారుల ఇష్ట ప్రకారమే బ్యాంకర్లు రు­ణాలు మంజూరు చేస్తున్నారే తప్ప ఇందు­లో ప్రభుత్వ ప్రమేయం ఏమీలేదని  స్పష్టంచేశారు. ఒక్కో యూనిట్‌ ఖరీదు రూ.75వేలు కాగా.. చేయూత పథ­కం కింద  లబ్ధిదారుల ఖాతా­ల్లో జమచేసిన మొదటి విడత సొమ్ము రూ.18,750ను నేరుగా బ్యాంకు ఖాతాకు జమ­చేయగా, మిగిలిన 56,250ను బ్యాంకులు రుణా­లుగా మంజూరు చే­శా­యన్నారు. ఈ మొత్తాన్ని తిరిగి వాయిదా ప­ద్ధతిలో తిరిగి చెల్లించే వెసులు­బాటు ప్రభుత్వం కల్పించిందన్నారు.

ఇక ఏటా చే­యూ­త పథకం కింద ప్రభుత్వం జమచేసే మొ­త్తాన్ని రుణవాయిదాల రూపంలో లబ్ధిదారులు చెల్లి­స్తున్నారని పేర్కొన్నారు. పశువుల ఎంపిక, కొను­గోలులో మధ్య­వర్తుల ప్రమేయం లేకుండా లబ్ధి­దారుల ఇష్ట్రప­కారమే రైతుల నుంచి రైతు పశు­వులను నేరుగా కొనుగోలు చేసుకున్నారని,  ఇందులో ప్రభుత్వానికి  ఎలాంటి ప్రమేయం లేదన్నారు.

ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం సబ్సిడీ రూపంలోగా­నీ, గ్రాంట్‌ రూపంలోగానీ  స­బ్సి­డీ విడుదల చేయలేనప్పుడు కుంభకో­ణా­లు, స్కాంలు జరగడానికి ఆస్కారం ఎక్కడ ఉంటుందని  ప్రశ్నించారు. పాడి పశువుల కొ­ను­గో­లు పూర్తిగా స్థానికంగానే జరుగుతున్నందున కొత్తగా పాడి సంపద పెరిగిన దాఖలాల్లేవన్నారు.  

ఇనాఫ్‌ ట్యాగ్స్‌తో రీసైక్లింగ్‌కు ఆస్కారంలేదు..
పథకంలో లబ్ధిదారులు కొనుగోలు చేసిన ప్రతీ పశువుకూ ఇనాఫ్‌ ట్యాగ్స్‌ ఉన్నాయని, అలాంటప్పుడు పాడి పశువుల రీసైక్లింగ్‌కు ఆస్కారం ఎక్కడ ఉంటుందని అమరేంద్రకుమార్‌ ప్రశ్నించారు.  పథకంలో లబ్ధిదారులు పాడి పశువులను ఇతర రాష్ట్రాల నుంచికాకుండా, రాష్ట్ర పరిధిలోనే తమకు నచ్చిన పశువును నేరుగా రైతు నుండే కొనుగోలు చేశారన్నారు. కాబట్టి పాడి పశువుల సంఖ్యలోగానీ, పాడిలో కానీ ఎలాంటి వ్యత్యాసం కానీ, స్థూల పాల దిగుబడిలో ఎటువంటి పెరుగుదల ఉండదని  స్పష్టంచేశారు.  

మరిన్ని వార్తలు