టీడీపీ తీరు రాజ్యాంగ విరుద్ధం

7 Jul, 2014 02:37 IST|Sakshi
టీడీపీ తీరు రాజ్యాంగ విరుద్ధం

శ్రీకాకుళం కలక్టరే ట్ : స్థానిక సంస్థల్లో మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీడీపీ పార్టీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందని మాజీ మంత్రి వైసీపీ నాయకులు తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. ఆదివారం పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహిళలు, గర్భిణీలు అని చూడకుండా టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడి అధ్యక్ష పదవులు దక్కించుకున్నారని విమర్శించారు. చాలా చోట్ల టీడీపీ కాంగ్రెస్ కుమ్మక్కుకావడం విచారకరమన్నారు. ఆమదాలవలసలో టీడీపీకి కాంగ్రెస్ ఎంపీటీసీలు, పురపాలక ఎన్నికల్లో కౌన్సెలర్లు మద్దతు ఇవ్వడం ఆపార్టీ సిద్దాంతాలను కాలరాసినట్లేనని ఆయన అన్నారు.
 
 ఉపాధ్యక్ష పదవికోసం ఆమదాలవలసలో బొడ్డేపల్లి వారసులు అమ్ముడుపోవడం బొడ్డేపల్లి రాజగోపాలరావు పేరు, ప్రతిష్టలను దిగజార్చడమేనన్నారు.ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హమీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రకృతి కూడా అనుకూలించడం లేదని విమర్శించారు. రుణ మాఫీ అంటే రీషెడ్యూల్ కాదని, రుణమాఫీ, డ్వాక్రా రుణాల రద్దు వెంటనే అమలు చేయాలన్నారు. చెన్నై ప్రమాద బాధిత కుటుంబాలకు రూ. 10 లక్షలు తక్కువ కాకుండా పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వలసల నివరాణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వైసీపీ నాయకులు కేవీ సత్యనారాయణ, చింతాడ ధనుంజయరావు, మొదలవలస లీలామోహన్ తదితరులు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు