సినీ పరిశ్రమను విశాఖకు తీసుకువస్తాం: చినరాజప్ప

25 Jan, 2015 04:15 IST|Sakshi

విశాఖ ఉత్సవాల్లో ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప
 సాక్షి, విశాఖపట్నం: సుందర విశాఖ నగరానికి సినీ పరిశ్రమను తీసుకువస్తామని ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. విశాఖలో జరుగుతున్న ‘విశాఖ ఉత్సవ్’ రెండో రోజు కార్యక్రమాల్లో మంత్రులు గంటా శ్రీనివాసరావు, రావెల కిషోర్‌లతో కలిసి  శనివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఆర్‌కె బీచ్‌లో ప్రధాన వేదికపై జరిగిన సభలో చినరాజప్ప ప్రసంగిస్తూ... వారంలో 5 రోజులు పనిచేస్తే రెండు రోజులు సెలవు తీసుకునే పద్ధతి విదేశాల్లో ఉందని, అలాంటిది మనకూ ఉండాలన్నారు.
 
 చిన్న గ్రామంలా ఉండే విశాఖ ఇప్పుడు మహా నగరం అయి స్మార్ట్ సిటీ జాబితాలో చేరిందని, దీనిని ప్రపంచ స్థాయికి తీసుకువెళతామన్నారు. మంత్రి రావెల కిషోర్ మాట్లాడుతూ హుద్‌హుద్ తుపాను వచ్చినపుడు నగరంలో అలుముకున్న నిరాశ నిస్ఫృహల నుంచి విశాఖవాసులు అత్యంత వేగం గా బయటపడి ఇలాంటి ఉత్సవాలు జరుపుకోవడం ఆదర్శనీయమన్నారు. కాగా.. రెండో రోజు కైలాసగిరిలో లేజర్‌షో ఆకట్టుకుంది. ఆర్‌కె బీచ్‌లో నమూనా దేవాలయాలకు సందర్శకులు పోటెత్తారు. గురజాడ కళాక్షేత్రంలో జరిగిన నృత్య రూపకాలు ఆకట్టుకున్నాయి. కిక్ బాక్సింగ్, బీచ్ వాలీబాల్ పోటీలు జరిగా యి. ఆంధ్రా యూనివర్శిటీలో విలువిద్య పోటీలు జరిగాయి. కాగా.. రెండో రోజు విశా ఖ ఉత్సవ్‌లో సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొంటారని అధికార వర్గాలు ప్రచారం చేసినా.. ఆయన రాలేదు.
 

మరిన్ని వార్తలు