ప్రాజెక్టుల్లో పెరుగుతున్న నీటి మట్టం

16 Jul, 2018 11:39 IST|Sakshi
ప్రాజెక్టుల్లో పెరుగుతున్న నీటి మట్టం

గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. దీంతో ప్రాజెక్టుల్లో నీటి మట్టం పెరిగి జలకళ సంతరించుకుంది. నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉన్నందున నీటిని దిగువకు విడుదల చేయాల్సి వస్తోంది. 

తూర్పుగోదావరి : జిల్లాలోని ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ వద్ద నీటి మట్టం అంతకంతకి పెరుగుతోంది. 3లక్షల 69వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వచ్చిచేరుతోంది. నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉన్నందున 3లక్షల 67వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. 

భద్రాద్రి : కిన్నెరసాని ప్రాజెక్టులోకి​ భారీగా వరద నీరు వచ్చి చేరటంతో నీటి మట్టం అమాంతం పెరిగిపోయింది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో రెండు గేట్లు ఎత్తి 12వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. 

కర్నూలు : తుంగభద్రా జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. ఇన్‌ఫ్లో 69717క్యూసెక్కులు కాగా ప్రస్తుత నీటి మట్టం 77986టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 100టీఎంసీలు. 

నిర్మల్‌ : కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగటంతో అధికారులు గోదావరి పరిసర ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాజెక్టులోకి 9600 క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతోంది. ప్రస్తుత నీటి మట్టం 698అడుగులు కాగా పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు.

మరిన్ని వార్తలు