కేంద్ర ఆర్థిక బడ్జెట్ మేడిపండు చందమే

1 Mar, 2016 01:09 IST|Sakshi
కేంద్ర ఆర్థిక బడ్జెట్ మేడిపండు చందమే


 వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి

గుంటూరు వెస్ట్ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2016-17 ఆర్థిక సంవత్సరానికి  ప్రవేశపెట్టిన బడ్జెట్ మేడిపండు చందంగా ఉందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. అరండల్‌పేటలోని తన కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఏపీకి కేంద్రం కుచ్చుటోపి పెట్టిందని ఆరోపించారు. విభజన చట్టం హామీలను పూర్తిగా విస్మరించి రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై కానీ, ప్రత్యేక ప్యాకేజీపైన కానీ కనీస ప్రస్తావన లేకపోవడంపై  విస్మయం వ్యక్తం చేశారు. నూతన రాజధాని నిర్మాణానికి ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం దురదృష్టకరమన్నారు.

దీనికి  రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. కీలకమైన ప్రత్యేకహోదా గురించి కేంద్రంపై ఒత్తిడి తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్రంపై చంద్రబాబు పోరాడాలని, లేనిపక్షంలో చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని హెచ్చరించారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీలకు పుట్టగతులు ఉండవన్నారు. నేతలు బండా రవీంద్రనాథ్, జగన్‌కోటి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య పాల్గొన్నారు.
 

 
 

మరిన్ని వార్తలు