అప్పు.. ముప్పు

20 Jan, 2014 04:31 IST|Sakshi

వారికి పిల్లలు లేరు.. వంశోద్ధారకుడి కోసం సోదరుడి కుమారుడిని దత్తత తీసుకున్నారు. ఉన్నత చదువులు చదివించారు. పెరిగి పెద్దవాడయ్యాక పెళ్లి జరిపించారు. వీరికి ముగ్గురు పిల్లలు జన్మించారు. ప్రైవేటుగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కానీ స్నేహితుడికి ఇప్పించిన అప్పు అతనిపై పడింది.
 
 దీంతో మనస్తాపానికి గురై భార్యాభర్త పురుగుల మందు తాగి పిల్లలకూ తాగించారు. భార్యాభర్త మృతిచెందగా ఇద్దరు కూతుళ్లు క్షేమంగా బయటపడ్డారు. కుమారుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. వంశాన్ని నిలబెట్టి వృద్ధాప్యంలో అండగా ఉంటాడనుకున్న కొడుకు అర్ధంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ విషాద ఘటన మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో ఆదివారం జరిగింది.
 
 దత్తప్పగూడెం(మోత్కూరు), న్యూస్‌లైన్: స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని.. అతడిని ఆదుకోవాలనుకున్నాడు. తను పనిచేస్తున్న ఫైనాన్స్ కంపెనీలో రూ.5 లక్షలు అప్పు ఇప్పించాడు. కానీ, స్నేహి తుడు ఆ సాయాన్ని మరిచాడు. కష్టకా లంలో ఆదుకున్న స్నేహితుడికే ఎగ నామం పెట్టాడు. అప్పు తీర్చకుండా ఉడాయించాడు. దీంతో అప్పు అతనిపై పడింది. వాటిని తీర్చే మార్గం లేకపో యింది. పైగా ఈ విషయంలో కుటుం బంలో ఘర్షణలు తలెత్తాయి. దీంతో చివరకు చావే మార్గం అనుకున్న ఆ దం పతులు ముగ్గురు చిన్నారులతో కలిసి మరణించాలని పురుగుల మందు సేవిం చారు.
 
 ఈ సంఘటన ఆదివారం మధ్యా హ్నం మోత్కూరు మండలం దత్తప్పగూ డెంలో జరిగింది. మృతుని బంధువులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం..  గ్రామస్తులు.. బాధితుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం దత్తప్పగూ డెంనకు చెందిన జినుకల శేఖర్(31)కు భార్య స్వర్ణరేఖ (28), కుమార్తెలు నేత్ర (05), చైత్ర (03), కుమారుడు (18నెల లు) ఉన్నారు. శేఖర్ ఎంఎస్సీ, బీఈడీ చదివాడు. స్వర్ణరేఖ కూడా బీఎస్సీ బీఈడీ చదివింది. వీరు కొంతకాలం నుంచి హైదరాబాద్, నల్లగొండ పట్టణా ల్లో ఉండి 15 రోజుల క్రితమే దత్తప్ప గూడెం చేరుకున్నారు. శేఖర్ హైద రాబాద్, నల్లగొండలలో ప్రైవేటు కంపె నీలలో పనిచేసేవాడు. అతని భార్య ప్రైవేటు పాఠశాలలో పనిచేసింది.
 
 శేఖర్ నల్లగొండలోని హెచ్‌డీఎఫ్‌సీలో పనిచేసే సమయంలో అతని స్నేహితునికి రూ.5 లక్షలు అప్పు ఇప్పించాడు. అయితే, అత ను అప్పు చెల్లించకుండా ఉడాయిం చాడు. దీంతో ఆ అప్పుతో పాటు వడ్డీ పెరగడంతో మనస్తాపం చెంది  కూల్ డ్రింకులో క్రిమిసంహారక మందు కలిపి భార్య స్వర్ణరేఖ(28), కుమార్తెలు ఐదేళ్ల నేత్ర, మూడేళ్ల చైత్ర, యేడాదిన్నర వయస్సు కుమారుడు పరుశరాములు (విక్కి)లతో తాగించాడు. వీరిలో శేఖర్, అతని భార్య స్వర్ణరేఖ మరణించారు. కుమారుడు పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరు కూతుళ్లు ప్రమాదం నుంచి బయటపడ్డారు.
 
 వంశాన్ని నిలబెడతాడని దత్తత తీసుకుంటే....
 ‘వంశాన్ని నిలబెట్టే వంశోద్ధారకుడనుకుంటే వంశమే లేకుండా పోయావా’ అని వృద్ధ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరుకు స్థానికుల కళ్లు చేమర్చాయి. దత్తప్పగూడెం గ్రామానికి చెందిన జినుకల కిష్టయ్య -నర్సమ్మలకు సంతానం కలగకపోవడంతో ఆయన సోదరుడు యాదయ్య-సుభద్రల కుమారుడు శేఖర్‌ను దత్తత తీసుకున్నారు. తన వంశాన్ని వంశోదారకుడిగా పెంచుకున్న కుమారుడు అతని భార్య అప్పు భారంతో మృతిచెందడంతో పెంచుకున్న తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచిన చిన్నారులకు సైతం కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి తాగించే కఠిన నిర్ణయం తీసుకున్న దంపతులు ఎంతగా మధన పడ్డారోనని స్థానికులు రోదిం చారు. విద్యావంతులైన కుమారుడు, కోడలు తమ పిల్లల భవిష్యత్తు తీర్చిద్ది, వృద్ధాప్యంలో తమకు సాకుతాడనుకుంటే ఎంతపని చేశారని బోరుమన్నారు. కుటుంబ సమేతంగా ఆత్మహత్యకు పాల్పడడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
 

మరిన్ని వార్తలు