కాంగ్రెస్ వైఖరితో రాష్ట్రం కుదేలు అయ్యింది: సీఎం కేసీఆర్‌

31 Oct, 2023 18:41 IST|Sakshi

సాక్షి, నల్లగొండ జిల్లా : సీఎం కేసీఆర్‌ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటూ అభ్యర్ధులను గెలిపించాలని కోరుతున్నారు. మిర్యాలగూడ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ రైతుబంధు దుబారా అన్న తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వ్యాఖ్యాల్ని ఖండించారు.  

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. 'కాంగ్రెస్, బీజేపీకి ఎవరో ఒకరు వస్తారు.‌బీఆర్ఎస్ వ్యక్తిని చూసి ఓటెయ్యండి. కాంగ్రెస్ వైఖరితో రాష్ట్రం కుదేలు అయ్యింది. రైతుబంధు దుబారా అన్న ఉత్తమ్ కుమార్‌ రెడ్డి మాటలు సరికాదు. దళితబంధును పుట్టించింది దేశంలో కేసీఆరే. అడవిదేవులపల్లి వద్ద కృష్ణా నదికి గోదావరిని లింక్ చేస్తాం. మిర్యాలగూడకు కళాభారతి మంజూరు చేస్తున్నాం' అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 

అంతకు ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా, సీఎం కేసీఆర్‌ హుజుర్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో రైతుబంధు ప‌దాన్ని ఈ ప్ర‌పంచంలో పుట్టించిందే కేసీఆర్ అని సీఎం తెలిపారు. 'రైతుబంధు మంచిది కాద‌ని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తిడుతున్నారు. దుబారా అని అంటున్నారు. స్వామినాథనే హైద‌రాబాద్‌కు వ‌చ్చి రైతుబంధు ప‌థ‌కాన్ని ప్ర‌శంసించారు. ఇలా రైతుబంధు వ‌ద్ద‌నే వారికి త‌గిన బుద్ధి చెప్పాలి. న‌వంబ‌ర్ 30న గుద్దుడు గుద్దితే పోలింగ్ బాక్సులు ప‌గిలిపోవాలి' అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.  

మరిన్ని వార్తలు