తిత్లీతో గురుకులాల్లో రూ.2.81 కోట్లు నష్టం

24 Oct, 2018 07:04 IST|Sakshi
గురుకుల సమస్యలను కలెక్టర్‌కు వివరిస్తున్న డీసీవో యశోదలక్ష్మి

కలెక్టర్‌కు వివరించిన  డీసీవో యశోదలక్ష్మి

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలోని సాంఘిక సంక్షేమ విభాగంలో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 12 బాలయోగి గురుకుల పాఠశాల్లో తిత్లీ తుఫాన్‌ వల్ల సుమారు రూ.2.81 కోట్ల నష్టం వాటిల్లిందని గురుకుల పాఠశాలల సమన్వయకర్త వై.యశోదలక్ష్మి కలెక్టర్‌ ధనంజయరెడ్డికి వివరించారు. మంగళవారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో ఆమె కలిసి గురుకులాల నష్టాల స్థితిగతులను తెలియజేశారు. 10 గురుకుల పాఠశాలల రక్షణ గోడలు పాడయ్యాయని చెప్పారు. చెట్లు పడిపోవడంతో గోడలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.

చాలాచోట్ల విద్యుత్‌ సదుపాయం కూడా లేదన్నారు. కంచిలి, మందస గురుకులాలకు మంగళవారం నాటికీ విద్యుత్‌ పునరుద్ధరణ కాలేదన్నారు. అనంతరం కలెక్టర్‌ స్పందిస్తూ పాడైన రక్షణ గోడలు వెంటనే నిర్మించాలని సంబంధింత ఇంజినీరింగ్‌ సిబ్బందికి ఫోన్‌లో ఆదేశించారు. విద్యుత్‌ సరఫరాను తక్షణం పునరుద్ధరించాలని  సూచించారు.

మరిన్ని వార్తలు