అమరావతిలో ధ్వనించిన సామాజిక సాధికారత

11 Nov, 2023 05:40 IST|Sakshi

దకూరపాడులో ఘనంగా సామాజిక సాధికార బస్సు యాత్ర 

అణచివేతను సంహరించిన సంబరమే సామాజిక సాధికారత : మంత్రి రజిని

వెనుకబడిన వర్గాలు నాయకత్వం వహించాలని చెప్పిన మొదటి నేత జగన్‌: మాణిక్యవరప్రసాద్‌ 

సాక్షి ప్రతినిధి, గుంటూరు: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో బడుగు, బలహీన వర్గాల్లో వచ్చిన చైతన్యం కళ్లకు కట్టింది. అమరావతి జనసంద్రం అయింది. వేలాది బడుగు, బలహీన వర్గాల ప్రజలు తరలిరాగా కృష్ణాతీరాన అమరేశ్వరుడి సన్నిధిలో స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకరరావు నేతృత్వంలో బస్సు యాత్ర విజయవంతంగా సాగింది. అనంతరం జరిగిన సభకు వేలాదిగా ప్రజలు పోటెత్తారు. మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతలు సీఎం జగన్‌ చేస్తున్న మేలును వివరించినప్పుడు ప్రజలు జేజేలు పలికారు. 

ఇది బడుగు, బలహీనవర్గాల ప్రభుత్వం : మంత్రి విడదల రజిని 
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. పెదకూరపాడు నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార సభలో మంత్రి రజిని మాట్లాడుతూ.. మహిషాసురుడ్ని సంహరిస్తే దసరా, నరకాసురుడిని సంహరిస్తే దీపావళి చేసుకుంటామని, తరతరాలుగా బడుగు, బలహీన వర్గాల అణచివేతను సంహరిస్తే ఆ ప్రభుత్వ పాలనను ఏమనాలని, ఆ సంబరాన్ని ఏమని పిలవాలని అన్నారు. ఆ ఉత్సవాలే సామాజిక సాధికారత అని చెప్పారు. నాలుగున్నరేళ్లలో విద్యా, వైద్యంలో విప్లవాత్మక మార్పులు తెచి్చన ఘనత సీఎం జగనన్నకే సొంతమన్నారు. ఏ ముఖ్యమంత్రీ ఆలోచన చేయని విధంగా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్‌్టతో ప్రభుత్వ వైద్యులు గ్రామానికే వచ్చి సేవలు అందిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు హయాంలో ఒక్క స్కూల్‌ బాగు చేయాలన్న ఆలోచనే చేయలేదని, ఆఖరికి పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనాన్ని కూడా సొమ్ము చేసుకున్నారన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ బిడ్డని అని గొప్పగా చెప్పుకుంటా : అలీ 
ఎల్రక్టానిక్‌ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్‌ చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి అనితర సాధ్యమని అన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా ఆంధ్రప్రదేశ్‌ బిడ్డని అని గొప్పగా చెప్పుకుంటానన్నారు. పెద్దగా చదువుకోని తనకే  తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడం, హిందీ, ఇంగ్లిష్‌ బాషలు వచ్చని, మన పిల్లలు ఇంగ్లీష్‌లో చదవకూడదా? మాట్లాడకూడదా? అని ప్రశి్నంచారు. మారుతున్న ప్రపంచంతోపాటే మన పిల్లలు కూడా మారాలన్నది సీఎం జగన్‌ ఆలోచన అని చెప్పారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలు నాయకత్వం వహించాలని చెప్పిన మొట్టమొదటి నేత వైఎస్‌ జగన్‌ అని చెప్పారు. పెత్తందారీ వ్యవస్థకు సీఎం జగన్‌ ఒక సవాలుగా నిలబడ్డారన్నారు.

ఈ సమావేశంలో మాజీ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాజకీయ పారీ్టలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టల  ఓట్ల కోసం మాయమాటలు చెప్పాయని, సీఎం జగన్‌ మాత్రం ఈ వర్గాల కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టి, అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని అన్నారు. బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌ అని ఎంపీ నందిగం సురేష్‌ చెప్పారు. చంద్రబాబు బడుగుల జీవితాలను వెక్కిరించారని, మనం ఇంగ్లిష్‌ మీడియం చదివితే పోటీకి వస్తారని భయపడి అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. అయినా, సీఎం జగన్‌ ఈ వర్గాల అభ్యున్నతి కోసం బాబు పన్నాగాలను విజయవంతంగా ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు శంకరరావు, మహ్మద్‌ ముస్తఫా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

ఇదీ చదవండి: జగనే రావాలి.. జగనే కావాలి

మరిన్ని వార్తలు