మత్తు వదిలించిన మహిళలు

19 Dec, 2013 03:44 IST|Sakshi

అజ్జాడ (బలిజిపేట), న్యూస్‌లైన్: ఆ ఊరికి పట్టిన మద్యం మత్తును వదిలించేందుకు ఆ గ్రామ మహిళలు ముందుకు వచ్చారు. గ్రామంలో మద్యం అమ్మకాలు పూర్తిగా నియంత్రించి, సంపూర్ణ మద్యపాన నిషేధానికి తీర్మానం చేయాల్సిందేనంటూ పట్టుబట్టారు. దీంతో గ్రామస్తులంతా అంగీకరించారు. గ్రామంలోని బె ల్టు షాపును ఎత్తివేయాల్సిందేనని ఇకపై గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయించినా, తాగినా కఠిన చర్యలుంటాయని తీర్మానించారు. బలిజిపేట మండలం అజ్జాడలో సర్పంచ్ లక్కెన ఎల్లంనాయుడు, కో ఆపరేటివ్ అధ్యక్షుడు అక్కెన జగన్నాథం నాయుడు, గ్రామ పెద్దలు ఐకమత్యంతో బుధవారం నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని గ్రామంలో విధించారు.

తొలుత గ్రామ మహిళలు బెల్టుషాపు ఎతివేసి పూర్తిగా మద్యం అమ్మకాలు నిలుపుదల చేయాలని కోరుతూ పురవీధుల్లో ర్యాలీ చేశారు. అనంతరం గ్రామ పెద్దలు, ప్రజల సహా యంతో బెల్టుషాపును ఎత్తివేయించారు. గ్రామంలో మద్యం అమ్మకాలు చేసిన వారికి జరిమానాతో పాటు కఠిన చర్యలు విధిస్తామని మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు హెచ్చరించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు  మాట్లాడుతూ గ్రామంలో మద్యాని కి చాలా మంది బానిసలు కావడంతో వారి కుటుంబాలు పలుఇబ్బందులు పడుతున్నాయన్నారు.

 గ్రామంలో బెల్టుషాపు ఉన్నందు న విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరగడంతో పెద్ద, చిన్న తారతమ్యం లేకుండా, పక్కగ్రామల నుంచి వచ్చి మరీ మద్యం తాగుతున్నారన్నారు. గ్రామంలో మద్యం అమ్మకాలు పూర్తిగా నిలుపుదల చేయాలం టూ పలుశాఖల ఉన్నతాధికారులకు ఫిర్యా దు చేశామని మహిళా సంఘ సభ్యులు పలగర నారాయణమ్మ, కె.నారాయణమ్మ, సింహాచలం,అన్నపూర్ణ, తెర్లి మంగమ్మ, ఆర్ జగదీశ్వరి తెలిపారు.

>
మరిన్ని వార్తలు