నేటి ముఖ్యవార్తలు

6 Sep, 2017 21:47 IST|Sakshi
వినాయక నిమజ్జనం
హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం కొనసాగుతోంది. మరో 3 గంటల్లో అధికారులు నిమజ్జనం పూర్తి చేయనున్నారు. లిబర్టీ చౌరస్తా నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు గణనాథుల వాహనాలు బారులు తీరాయి. అధికారులు ఎన్టీఆర్‌ మార్గ్‌ మినహా అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఎత్తివేశారు. 
 
ప్రధాని పర్యటన
ప్రధాని నరేంద్రమోదీ నేటి నుంచి మూడు రోజుల పాటు మయన్మార్‌లో పర్యటించనున్నారు.
 
కంటి ఆపరేషన్‌
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు నేడు కంటి ఆపరేషన్‌ జరగనుంది.
 
కాకినాడ మేయర్‌ ఎన్నిక
ఇవాళ కాకినాడ మేయర్‌ ఎంపిక కేసు హైకోర్టులో విచారణకు రానుంది. కోర్టు తీర్పు ప్రకారం ఎన్నికల కమిషన్‌ నోటిఫీకేషన్‌ జారీచేయనుంది. 
 
ఏపీ సీఎం పర్యటన
ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు.
నేడు విశాఖ జిల్లా వాకపల్లిలో ప్రజాసంఘాల పర్యటించనున్నాయి.
 
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
ఒడిశా నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 48 గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడుతాయని వాతవారణ కేంద్రం పేర్కొంది.
 
ఎకైక టీ20
శ్రీలంక పర్యటనలో భాగంగా నేడు భారత్‌-శ్రీలంక మధ్య  ఏకైక టీ-20 మ్యాచ్‌ సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభంకానుంది.
 
ప్రోకబడ్డీ
ప్రోకబడ్డీ లీగ్‌లో నేడు బెంగాల్‌ వారియర్స్‌తో యు ముంబా, దబాంగ్‌ ఢిల్లీ జట్టుతో బెంగళూర్‌ బుల్స్‌ తలపడనున్నాయి.

 

మరిన్ని వార్తలు