ఈనాటి ముఖ్యాంశాలు

18 Dec, 2019 19:22 IST|Sakshi

మరో చారిత్రాత్మక ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందడుగు వేసింది. కడప స్టీల్‌ ప్లాంట్‌కు ఐరన్‌ ఓర్‌ సరఫరాపై ఎన్‌ఎండీసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పదం కుదరింది. ఇదిలా ఉండగా మూడు రాజధానులు రావాల్సిన పరిస్థితి కనిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో బుధవారం జీవీఎల్‌ విలేకరులతో మాట్లాడారు.  ఒకేచోట రాజధాని నిర్మాణంతో ఆర్థికాభివృద్ధి జరగదని బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటును ఉత్తరాంధ్ర ప్రజలు తరఫున తాను స్వాగతిస్తున్నానని వైఎస్సార్‌సీపీ నేత దాడి వీరభద్రరావు అన్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల టీడీపీ నేతలు బానిస బతుకులు బతకొద్దని ఆయన ఆయన సూచించారు. ఇక జాతీయ వార్తల విషయానికి వస్తే దేశాన్ని విద్వేషాలతో తగులబెడుతున్నారని మోదీ సర్కార్‌పై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం తీసువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీలను బెంగాల్‌లో అమలు చేయబోమని ఆమె తేల్చిచెప్పారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియ్ క్లిక్‌ చేయండి.  

మరిన్ని వార్తలు