ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

12 Jan, 2014 02:20 IST|Sakshi
విజయనగరం  క్రైం, న్యూస్‌లైన్ : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్‌పీ ఎస్.శ్రీనివాస్ హెచ్చరించారు. పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో 25వ రోడ్డు భద్రతా వారోత్సవాలను ఆయన శనివారం ప్రారంభించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ కు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లపైన ఆటోలను ఎక్కడబడితే అక్కడ సడన్‌గా నిలుపుదల చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఆటోల్లో ఎక్కువ మంది ప్రయూణికులు ఉంటారని, అటువంటి సమయూల్లో డ్రైవర్లు వాహనాల ను సక్రమంగా నడపాలన్నారు. ప్రయూణికులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. 
 
 ఆటో డ్రైవర్ తప్పనిసరి గా లెసైన్స్ కలిగి ఉండాలన్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు. ఇందుకు ఆటో డ్రైవర్లు కూడా సహకరించాలని కోరారు. వారోత్సవాల్లో భాగంగా రోడ్డు ప్రమాదాలు, పట్టణ ట్రాఫిక్‌పై అవగాహన కల్పిస్తామన్నారు. ట్రాఫిక్ సీఐ ఎ.రవికుమార్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు తమకు కేటారుుంచిన స్థలాల్లో నిలపాలన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్‌ఐ మూర్తి, ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి నారాయణరావు, అధ్యక్షుడు ఎస్.అప్పలరాజురె డ్డి, అసోసియేట్ అధ్యక్షుడు బొమ్మాన పాపారావు, ఉపాధ్యక్షుడు వై.సన్యాసిరావు, కోశాధికారి బి.సన్యాసిరావు పాల్గొన్నారు. 
 
 
మరిన్ని వార్తలు