నేడు తిరుపతిలో ట్రాఫిక్‌ మళ్లింపు

17 Sep, 2018 09:43 IST|Sakshi

చిత్తూరు, తిరుపతి (అలిపిరి): శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం జరగనున్న గరుడసేవకు పెద్ద ఎత్తున భక్తులు హాజరుకానున్న దృష్ట్యా తిరుపతిలో ట్రాఫిక్‌ మళ్లింపు ఉంటుం దని ట్రాఫిక్‌ డీఎస్పీ సుకుమారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తిరుపతిలో ద్విచక్రవాహనాలకు ప్రత్యేక పార్కింగ్‌ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. సోమవారం ఉదయం 6 నుంచి మంగళవారం ఉదయం 6 వరకూ నిబంధనలు అమలులో ఉంటాయి. ద్విచక్రవాహనదారుల సౌకర్యార్థం రోడ్డు మార్గం సూచించే బోర్డులు ఏర్పాటు చేయనున్నారు.

మళ్లింపు ఇలా...
ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్టాండుకు కడప, హైదరాబాద్‌ బస్సులు కరకంబాడి మీదుగా రేణిగుంట, ఆటోనగర్, రామానుజ సర్కిల్‌ మీదుగా మళ్లిస్తారు.  
చిత్తూరు.. మదనపల్లి.. బెంగళూరు వైపు నుంచి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌కు తుమ్మలగుంట, ఉప్పరపల్లి క్రాస్, వైకుంఠాపురం, ముత్యాలరెడ్డి పల్లి, అన్నమయ్యసర్కిల్, శంకరంబాడి సర్కిల్, రామానుజ సర్కిల్‌– పూర్ణకుంభం సర్కిల్‌ వైపు మళ్లిస్తారు.
కర్ణాటక, తమిళనాడు ఆర్టీసీ బస్సులు తిరుపతి బస్టాండ్‌లో కేటాయించిన పార్కింగ్‌ స్థలంలోనే పార్కింగ్‌ చేయాలి. బస్టాండ్‌ బయట ప్రదేశాల్లో, నగరంలోని ప్రదేశాల్లో పార్కింగ్‌కు అనుమతించరు.
బెంగళూరు నుంచి తిరుపతికి కర్ణాటక బస్సులు తిరుపతి బైరాగిపట్టెడ ఆర్చ్‌ దగ్గర తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పార్కింగ్‌ స్థలం నుంచే రాకపోకలకు అనుమతిస్తారు.
లీలామహల్‌ జంక్షన్, కరకంబాడిరోడ్డు, బాలాజీ కాలనీ, టౌన్‌ క్లబ్, గరుడ సర్కిల్‌ మార్గాల్లో ఆర్టీసీ బస్సులను అనుమతించరు.

ద్విచక్రవాహనాల పార్కింగ్‌..
గరుడసేవ సందర్భంగా టీటీడీ పాత చెకింగ్‌ పాయింట్‌ వద్ద ద్విచక్రవాహనాల పార్కిం గ్‌కు ఏర్పాటు చేశారు. చెర్లోపల్లి వైపు నుంచి వచ్చే ద్విచక్రవాహనాలు జూపార్కు, వేదిక్‌ యూనివర్సిటీ, స్విమ్స్, వివేకానందా సర్కిల్‌ వరకు అనుమతిస్తారు.
కరకంబాడి వైపు నుంచి వచ్చే ద్విచక్రవాహనాలు.. లీలామహల్‌ సర్కిల్, మున్సిపల్‌ పార్కింగ్‌ క్రాస్, అన్నారావు సర్కిల్, హరేరామ హరేకృష్ణ రోడ్డు ద్వారా పార్కింగ్‌ స్థలానికి వెళ్లవచ్చు.
బాలాజీ కాలనీ, టౌన్‌ క్లబ్‌ నుంచి వచ్చే ద్విచక్రవాహనాలు రామకృష్ణా సర్కిల్, స్విమ్స్‌ క్రాస్, వివేకానంద సర్కిల్, రుయాస్పత్రి జంక్షన్‌ ద్వారా టీటీడీ పాత చెక్‌పాయింట్‌ చేరుకోవచ్చు.
నాలుగు చక్రాల వాహనాలు హరేకృష్ణ ఆలయం ఎదుట ఉన్న వినాయక నగర్‌ గ్రౌండ్‌లో పార్కింగ్‌కు అనుమతిస్తారు.
టూరిస్ట్‌ బస్సులను చెర్లోపల్లి జూపార్క్‌రోడ్డులోని క్యాన్సర్‌ ఆస్పత్రి గ్రౌండ్‌లో పార్కింగ్‌కు అనుమతిస్తారు.

మరిన్ని వార్తలు