20 మంది ఐపీఎస్‌ల బదిలీ

7 Mar, 2020 04:06 IST|Sakshi
హరీష్‌కుమార్, ఆర్కే మీనా

పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌గా హరీష్‌

ఏడీజీగా పదోన్నతి పొందిన మీనా విశాఖ సీపీగానే కొనసాగింపు

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. హోంగార్డ్స్‌ ఏడీజీగా ఉన్న హరీష్‌కుమార్‌ గుప్తను ఏపీ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌గా బదిలీ చేసింది. ప్రస్తుతం విశాఖపట్నం నగర పోలీస్‌ కమిషనర్‌గా కొనసాగుతున్న ఆర్కే మీనాకు ఏడీజీగా పదోన్నతి కల్పించి అక్కడే కొనసాగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఎవరు.. ఎక్కడంటే..
- వెయిటింగ్‌లో ఉన్న పి.హరికుమార్‌కు ఐజీ లీగల్‌గా పోస్టింగ్‌
- ఎస్‌ఐబీ డీఐజీ సిహెచ్‌ శ్రీకాంత్‌కు ఐజీగా పదోన్నతి. అదే స్థానంలో కొనసాగింపు
- ఏలూరు డీఐజీ ఏఎస్‌ ఖాన్‌కు ఐజీగా పదోన్నతి. మెరైన్‌ ఐజీగా పోస్టింగ్‌
- సీఐడీ డీఐజీ ప్రభాకరరావుకు ఐజీగా పదోన్నతి. గుంటూరు రేంజ్‌కు బదిలీ
- గుంటూరు ఐజీ వినిత్‌ బ్రిజ్‌లాల్‌ సాండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు బదిలీ. ఎక్సైజ్‌ ప్రొహిబిషన్‌ అదనపు బాధ్యతలు
- విజయవాడ జాయింట్‌ సీపీ డి.నాగేంద్రకుమార్‌ పదోన్నతిపై ఐజీగా పీ అండ్‌ ఎల్‌కు బదిలీ
- కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ ఎస్పీ కొల్లి రఘురామిరెడ్డికి డీఐజీగా పదోన్నతి. అదే స్థానంలో కొనసాగింపు
- ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ జీవీజీ అశోక్‌ కుమార్‌కు డీఐజీగా పదోన్నతి. అదే స్థానంలో కొనసాగింపు
- ఇంటెలిజెన్స్‌ ఎస్పీ జి.విజయ్‌కుమార్‌కు డీఐజీగా పదోన్నతి. అదే స్థానంలో కొనసాగింపు
- డీసీపీ విజయవాడ అడ్మిన్‌ ఎస్‌.హరికృష్ణకు డీఐజీగా పదోన్నతి. సీఐడీకి బదిలీ
- ఎస్‌ఐబీ ఎస్పీ ఎం.రవిప్రకాష్‌కు డీఐజీగా పదోన్నతి. ఏసీబీకి బదిలీ
- ఎస్‌వీ రాజశేఖర్‌బాబుకు డీఐజీగా పదోన్నతి. పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ శాంతి భద్రతల విభాగం కో–ఆర్టినేటర్‌గా బదిలీ
- ఇంటెలిజెన్స్‌ ఎస్పీ కేవీ మోహన్‌రావుకు డీఐజీగా పదోన్నతి. ఏలూరు రేంజ్‌కు బదిలీ
- గుంటూరు ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణకు డీఐజీగా పదోన్నతి. అదే స్థానంలో కొనసాగింపు
- పార్వతీపురం ఏఎస్పీ గరుడ్‌ స్మిత్‌ సునీల్‌ నర్సీపట్నం ఓఎస్డీకి బదిలీ
- వేకెన్సీలో ఉన్న బి.కృష్ణారావు ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌ కమాండెంట్‌గా బదిలీ
- చింతూరు ఓఎస్డీ అమిత్‌ బర్డార్‌ కాకినాడ 3వ ఏపీఎస్పీ బెటాలియన్‌ కమాండెంట్‌గా బదిలీ
- బొబ్బిలి ఏఎస్పీ గౌతమి సాలి అడ్మిన్‌ అడిషనల్‌ ఎస్పీగా కర్నూలుకు బదిలీ

మరిన్ని వార్తలు