జల దిగ్భంధనంలోనే గిరిజన గ్రామాలు

6 Aug, 2019 12:18 IST|Sakshi

స్వల్పంగా తగ్గిన వరద ఉధృతి

సాక్షి, పశ్చిమగోదావరి: పోలవరంలో వరద ఉధృతి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం నీటిమట్టం 26 అడుగులుగా కొనసాగుతోంది. ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే రహదారులపై వరద నీరు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.19 గిరిజన గ్రామాలు తొమ్మిది రోజులుగా జలదిగ్భంధంలోనే ఉన్నాయి.

తుంగభద్ర జలాశయానికి వరద నీరు
కర్నూలు: తుంగభద్ర జలాశయానికి వరద నీరు చేరుతుంది. పూర్తిస్థాయి నిల్వ 100 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 36 టీఎంసీలకు చేరుకుంది. ఇన్‌ఫ్లో 23,052  క్యుసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 1230 క్యుసెక్కులు ఉంది. శ్రీశైలం జలాశయానికి వరద పెరుగుతుంది.ప్రస్తుతం నీటిమట్టం 866.60 అడుగులు కొనసాగుతుంది. ఇన్‌ఫ్లో 2,55,779 టీఎంసీలు ఉండగా, ఔట్‌ ఫ్లో 50,880 క్యుసెక్కులుగా ఉంది.

మరిన్ని వార్తలు