శ్రీవారి దర్శన సమాచారం ఇవ్వడానికి..

1 Mar, 2019 12:55 IST|Sakshi

ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసిన టీటీడీ

సాక్షి, తిరుమల : శ్రీవారి సర్వదర్శనం చేసుకునే భక్తులకు ఏ సమాయానికి దర్శనమవుతుందో తెలియజేయడానికి చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. కంపార్ట్ మెంట్లలో వేచి ఉండే భక్తులకు సమాచార ఇచ్చేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించేందుకు చేపట్టామని అన్నారు. జూన్ మాసానికి సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను శుక్రవారం ఆయన ఆన్‌లైన్‌లో విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. హైదరాబాదులో నిర్మించిన శ్రీవారి ఆలయంలో ఈ నెల 8న సాయంత్రం అంకురార్పణ, 13న విగ్రహ ప్రతిష్ట జరుగుతుందని చెప్పారు. ఏప్రిల్ 13 నుంచి కడప జిల్లాలోని ఒంటిమిట్టలో కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

‘మహసంప్రోక్షణ’పై పుస్తకం తెస్తాం..
తిరుమల శ్రీవారి ఆలయంలో గతేడాది నిర్వహించిన మహసంప్రోక్షణ, 2030లో నిర్వహించే మహసంప్రోక్షణ కార్యక్రమాలను పుస్తకరూపంలో తీసుకువస్తామని ఈవో వెల్లడించారు. ఆగమ సలహా మండలి సూచన మేరకు రూ.1.5 కోట్లతో రథ మండపం, రూ.23 కోట్లతో నారాయణ గిరి ఉద్యానవనంలో క్యూ కాంప్లెక్స్ నిర్మించనున్నామని తెలిపారు. రూ.4.5 కోట్లతో శ్రీవారి పుష్కరిణి ఆధునికీకరణపనులు చేస్తూన్నామని తెలిపారు. ఏఫ్రిల్ 24 నుంచి 27 వరకు వరహాస్వామి ఆలయంలో మహాసంప్రోక్షణ ఉంటుందని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు