భారీ కంటెయినర్ బోల్తా : ఇద్దరు మృతి

30 Jun, 2015 15:03 IST|Sakshi
భారీ కంటెయినర్ బోల్తా : ఇద్దరు మృతి

భీమడోలు (పశ్చిమగోదావరి జిల్లా) : వేగంగా వెళ్తున్న భారీ కంటెయినర్ లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం జాతీయరహదారిపై పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండల కేంద్రంలోని రైల్వేగేట్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడటంతో.. లారీ దూసుకెళ్లి రోడ్డుపై ఉన్న వికలాంగుడిని ఢీ కొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

లారీ రోడ్డుపై ఉన్న చిన్న దేవాలయాన్ని ఢీకొట్టి సమీపాన ఉన్న బస్టాండ్ షెల్టర్‌లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో లారీలో ఇద్దరు వ్యక్తులు ఉండగా, ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరో  వ్యక్తి లారీలో చిక్కుకొని ఉన్నాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు