ఇద్దరు రైతుల ఆత్మహత్య

4 Sep, 2013 13:53 IST|Sakshi

వెల్మగూడెం(పెద్దవూర),న్యూస్‌లైన్:  అప్పుల బాధ, ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ మంగళవారం జిల్లాలో ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. తీసుకున్న అప్పు తీర్చే మార్గం కన్పించక, మరో వైపు రోజురోజుకూ జఠిలమవుతున్న సమస్యలతో విసిగివేసారి చావే శరణ్యమనుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పెద్దవూర, చిట్యాల మండలాల్లో చోటు చేసుకున్న ఈ సంఘటనల వివరాలు.. పెద్దవూర మండలం వెల్మగూడానికి చెందిన గౌడి కొండల్(39) నాలుగు ఎకరాల భూమి కౌలుకు తీసుకుని రెండేళ్లుగా పత్తి పంటను సాగు చేస్తున్నాడు.
 
 గత ఏడాది కౌలు, పత్తి సాగుకు పెట్టుబడి కలిపి లక్ష రూపాయలు అప్పు అయ్యింది. ఈ ఏడాది అయినా పంట బాగా పండితే అప్పులు తీర్చుదామని అనుకున్న కొండల్‌కు నిరాశే ఎదురైంది. నిత్యం కురుస్తున్న వర్షాలకు పత్తి చేను గూడలు రాలిపోతున్నాయి. అప్పు రెండు లక్షలకు పెరిగిం ది. దీంతో దుణదాతలు అప్పు తీర్చమని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో జీవితంపై విరక్తి చెంది కొండల్ సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తాడిపర్తి శేషుబాబు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
 
 గుళికలు తిని..
 చిట్యాల: చిట్యాల మండల కేంద్రానికి చెందిన ఆవుల వెంకులు(50)కు వనిపాకల గ్రామానికి వెళ్లే రోడ్డులో రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వ్యవసాయం చేస్తూనే కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఇతడికి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో తన వ్యవసాయ క్షేత్రంలోనే మంగళవారం గుళికలు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందు తూ మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ అంజయ్య తెలిపారు.
 

మరిన్ని వార్తలు