అమ్మను పోషించాలి.. ఉద్యోగం లేదన్నా

28 Aug, 2018 06:57 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం :‘నేను బీఫార్మసీ చదువుకున్నాను. స్థానికంగా అనేక పరిశ్రమలు ఉండడంతో ఇక్కడ ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాను. అచ్యుతాపురంలో ఉన్న పరిశ్రమల్లో ఇక్కడి వారికి ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నా’ అంటూ రామన్నపాలేనికి చెందిన రూపవతి పాదయాత్రలో జగన్‌కు చెప్పారు. బాబువస్తే జాబు వస్తుందని ప్రచారం చేశారని, అయితే ఎవరికి, ఎక్కడ వస్తున్నాయో తెలియడంలేదని,  ‘నా తండ్రి నా చిన్నప్పుడే నాతల్లిని, నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడు. అమ్మ కూలి పనిచేసి నన్ను బీఫార్మసీ చదివించింది. ఎన్ని సార్లు ఇంటర్వ్యూలకు వెళ్లినా ఉద్యోగం మాత్రం రావడం లేదన్నా అంటూ కన్నీళ్లపర్యంతమయ్యారు.

మరిన్ని వార్తలు