జనమే బలమై... | Sakshi
Sakshi News home page

జనమే బలమై...

Published Tue, Aug 28 2018 7:01 AM

YS Jagan Praja Sankalpa Yatra In Achyuthapuram Villages - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆత్మీయబంధువు రాకతో ఆ పల్లెలు పరవశించిపోతున్నాయి. పాదం పాదం కలుపుతూ కదం తొక్కుతున్నాయి. చేయి చేయి కలిపి జేజేలు పలుకుతున్నాయి. చెదరని చిరునవ్వుతో జగనన్న చూపిస్తున్న ఆత్మీయానురాగాలకు పల్లె మనసులు మురిసిపోతున్నాయి. రేపటి వెలుగుల కోసం శంఖారావం పూరిస్తున్నాయి.వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పాదయాత్ర యలమంచిలి నియోజకవర్గంలో వరుసగా ఐదోరోజు అశేష జనవాహిని మధ్య సాగింది. పాదయాత్ర సాగే దారులన్నీ జనసంద్రాలను తలపిస్తున్నాయి.  పాదయాత్ర అచ్యుతాపురం మండలం రామన్నపాలెం వద్ద ప్రారంభమైంది. రామన్నపాలెం, అప్పన్నపాలెం. మదుటూరు జంక్షన్, సానికాలువ, చీములాపల్లి, బంగారంపాలెం క్రాస్, కొండకర్ల గ్రామాలు మీదుగా కొండకర్ల జంక్షన్‌ వరకు సాగింది. సోమవారం అప్పన్నపాలెం, సానికాలువ, చీములాపల్లి, కొండకర్ల గ్రామాల్లో అయితే అడుగు తీసి అడుగు వేయడానికి కూడా వీల్లేనంత జనంతో రహదారులు కిక్కిరిసిపోయాయి. పాదయాత్రలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, యలమంచిలి కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు, ఆయన తనయుడు డీసీసీబీ మాజీ చైర్మన్‌ సుకుమార వర్మ,  మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు, అనకాపల్లి పార్లమెంటు కో ఆర్డినేటర్‌ వరుదు కల్యాణి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రగడ నాగేశ్వరరావు తదితరులు జగన్‌ వెంట నడిచారు. కాగా ఎంపీ వి.విజయసాయిరెడ్డి సోమవారం ఉదయమే వైఎస్‌ జగన్‌ను కలిసి వెళ్లారు.

ఆ జీవో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నష్టం
ప్రభుత్వం జారీ చేసిన జీవో 550 వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ వైద్య విద్యార్థులకు నష్టం జరుగుతోందని అఖిలభారత బీసీ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.వెంకటేశ్వరరావు జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఈ జీవో రద్దయ్యేలా చూడాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఇక పర్యాటకరంగంపేరుతో 1700 ఎకరాలున్న కొండకర్ల ఆవను 500 ఎకరాలకు కుదించి రైతులకు అన్యాయం చేస్తున్నారని కొండకర్ల ఆవ మాజీ చైర్మన్‌ జగన్‌ జృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం నిర్ణయం వల్ల 10 గ్రామాల్లోని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వివరించారు. 19 మంది మానసిక దివ్యాంగులతో ఆశ్రమ నిర్వాహకుడు జగన్‌ను కలిసి ప్రభుత్వం ఎలాంటి ఆసరా అందించడం లేదని చెప్పారు. కనీసం పింఛను కూడా మంజూరు చేయలేదని జగన్‌కు వివరించారు.

పాదయాత్రలో పాదయాత్ర ప్రోగ్రామ్స్‌ కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్, శాసనసభ ఉపనాయకుడు బూడి ముత్యాలనాయుడు, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ఎస్‌.నాగిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి త్రినాథరెడ్డి, కృష్ణాజిల్లా కార్యదర్శి సుభాష్‌ చంద్రబోస్, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాద్, బొత్స సత్యనారాయణ, అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, అనకాపల్లి పార్లమెంట్‌ సమన్వయకర్త వరుదు కల్యాణి, మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు, సమన్వయకర్తలు యు.వి.రమణమూర్తి రాజు, అన్నం రెడ్డి అదీప్‌రాజు, కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర గణేష్, శెట్టి ఫాల్గుణ, తిప్పల నాగిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ప్రగడ నాగేశ్వరరావు, బొడ్డేడ ప్రసాద్, దంతులూరి దిలీప్‌కుమార్, వై.వి.శివారెడ్డి, సీఈసీ సభ్యులు కాకర్లపూడి శ్రీకాంత్‌రాజు, పైల శ్రీనివాసరావు, డీసీసీబీ మాజీ చైర్మన్‌ ఉప్పలపాటి సుకుమార్‌వర్మ, ఏటికొప్పాక సుగర్‌ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్‌ ఆర్‌.ఎస్‌.రామభద్రరాజు, రాష్ట్ర యూత్‌ విభాగం అధికారప్రతినిధులు తుళ్లి చంద్రశేఖర్‌ యాదవ్,  శెట్టి వినయ్, అరకు పార్లమెంట్‌ విద్యార్థి విభాగం అధ్యక్షుడు తడబారిక సురేష్‌ కుమార్, వేంపల్లి నిరంజన్‌రెడ్డి, సోషల్‌ మీడియా అధ్యక్షుడు పూర్ణ, సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు వంగపండు ఉష, రాష్ట్ర, జిల్లా నాయకులు చొక్కాకుల వెంకటరావు, గొర్లె సూరిబాబు, మల్లపురావు, గొల్లవిల్లి శ్రీనివాసరావు, దంతులూరి శ్రీధర్‌రాజు, మంజు ప్రసాద్‌రెడ్డి, బోదెపు గోవింద్, మాజీ ఎంపీపీ ఆర్‌.నరసింగరావు, జి.కిరణ్‌రాజు, మళ్ల బుల్లిబాబు, పట్నాల నాగేశ్వరరావు, నక్క అప్పలనాయుడు, ఎం.నానాజీ, గిడ్డి విజయలక్ష్మి, లకే నానిపాత్రుడు, డి.శంకరరావు, లాలం రాంబాబు, ఈత నాగేశ్వరరావు, కోల అప్పలరాజు, తుమ్మల అప్పారావు, కంఠంరెడ్డి రామునాయుడు, మజ్జి రమణ, సియ్యాద్రి బైరాగినాయుడు, పల్లెల శివ, పడాల గణపతి, ఆబోతుల స్వామినాయుడు, గీతల దేవుడు, దూళి నూకరాజు, చొప్పా సన్యాసిరావు, చేపల శ్రీరాములు, కె.రామకృష్ణ, ముసిడి మత్స్యలింగం, కొర్రా రామకృష్ణ, గంపరాయి దిలీప్‌కుమార్, ఎస్‌.సింహాచలం,  పిన్నమరాజు వాసు, గంగిరెడ్డి వాసు, ఇల్లపు ప్రసాద్, ఉంగరాల సంతోష్, ఇచ్ఛాపురం నుంచి అందాల విక్రం, కుప్పం నుంచి ఆడిక చంద్రశేఖర్‌రావు, కంచాల బాబిరెడ్డి, చిన్నయ్య గోవిందరావు, జి.రాజారెడ్డి, ఎం.నాగభూషణ్‌ నాయక్, సుబ్రహ్మణ్యం, పులివెందుల నుంచి వీరప్రతాప్‌రెడ్డి, రజనీకాంత్‌రెడ్డి, చిన్నపరెడ్డి, శివన్నాగరెడ్డి,  ఆవుల భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పునరావాస కాలనీలో అక్రమాలు
అచ్చుతాపురం మండలం దిబ్బపాలెం ఎస్‌ఈజడ్‌ కాలనీలో 450 మంది అనర్హులకు ప్లాట్లు కేటాయించి అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ దిబ్బపాలెం నిర్వాసితులు జగన్‌కు వినతిపత్రం సమర్పించారు. వీరి ఆగడాల వల్ల అర్హులైన సుమారు 200 మంది నిర్వాసితులకు అన్యాయం జరిగిందని వాపోయారు. ఈ అక్రమాలపై విజిలెన్స్‌ దర్యాప్తు సాగినా చర్యలు తీసుకోలేదని జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. అదే విధంగా ఎన్‌ఏవోబీ నిర్వాసితులు కూడా తమకు జరిగిన అన్యాయాలపై అడుగడుగునా జగన్‌కు వినతిపత్రాలు సమర్పించారు. గ్రామీణ వైద్యులకు వెయ్యి గంటలు శిక్షణ ఇప్పించి 104, 108 వాహనాలలో నియమించేందుకు వీలుగా మహానేత జారీ చేసిన జీవో నంబరు 429ను నేడు చంద్రబాబు అటకెక్కించేశారని, మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ జీవోను అమలు చేయాలని కోరుతూ గ్రామీణ వైద్యులు అప్పన్నపాలెం వద్ద వైఎస్‌ జగన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

బ్యాంక్‌ విల్లింగ్‌ లేకుండా ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలు ఇవ్వడం లేదని దళితులు, ప్రభుత్వం గుర్తించడం లేదని రంగస్థల కళాకారులు, రాంబిల్లి మండలం ఏలుగుండు పాలెం గ్రామాన్ని జెడ్‌చింతల గ్రామానికి తరలించేశారని, కానీ మాకు ఉపాధి చూపించలేదని ఆ గ్రామస్తులు ఇలా వివిధ వర్గాల ప్రజలు జగన్‌ వద్ద మొరపెట్టుకున్నారు. ఎత్తున అక్కచెల్లమ్మలు సోమవారం కూడా జననేతకు రాఖీలు కట్టేందుకు పోటీపడ్డారు.

Advertisement
Advertisement