విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించిన కేంద్రమంత్రి

9 Nov, 2019 15:48 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు, గనుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శనివారం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ఒడిశా మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఒఎండిసి) నుంచి ఐరన్‌ ఓర్‌ సరఫరా అవుతుందని.. తక్కువ రేటుకు వచ్చేలా చర్చలు జరుపుతామని  వెల్లడించారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు విషయంలో కృషి చేస్తామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చెందాలంటే జాయింట్ వెంచర్ అవసరముందని అభిప్రాయ పడ్డారు. 

దేశంలో ఆంధ్రా, ఒడిశా, చత్తీస్‌గడ్ రాష్ట్రాలలో వున్న ఉక్కు పరిశ్రమలు కలిపి 85 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధిస్తుందన్నారు. 2030 నాటికి 2 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం పెరిగేలా కృషి చేస్తామన్నారు. స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో కార్మికుల కృషి ప్రధానమన్నారు. కార్యక్రమంలో ఎంపీలు సత్యవతి, ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి , ఎమ్మెల్సీ మాధవ్, హరిబాబు, సిఎండి పికే రథ్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు