మహిళలకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి: వాసిరెడ్డి పద్మ

31 Aug, 2019 12:50 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఒకప్పుడు ఆడపిల్ల చదువుకోవడం ఇబ్బంది అయితే.. ఇప్పుడు చదువుకుంటున్నప్పుడు పడుతున్న బాధలు ఇబ్బందిగా మారాయని మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం చేసిన బిల్లులు వారి జీవితాల్లో ఎంతో మార్పును తీసుకువస్తాయని పేర్కొన్నారు. వివిధ రంగాల్లో దూసుకుపోతున్న మహిళలకు వే ఫౌండేషన్ అండ్‌ ఇండియన్ ఉమెన్ సమ్మిట్ ఆధ్వర్యంలో... ‘ఉమెన్ ఎక్సలెన్సీ లీడర్ షిప్‌’ అవార్డులు ప్రదానం చేశారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి వాసిరెడ్డి పద్మ సహా ఎంపీ చింతా అనురాధ, ఇతర మహిళా ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ..ప్రతి మహిళ చిన్నప్పటి నుంచి తన లక్ష్యాన్ని సాధించాలనే తపనతోనే జీవిస్తుందన్నారు. మహిళలు ముందుకు వెళ్ళడానికి అనేక అవకాశాలు ఉన్నా కూడా.. ముందుకు వెళ్ళే క్రమంలో అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ‘వివిధ కారణాల వల్ల వెనుకబడిన వారిని ముందుకు తీసుకువెళ్ళడానికే రిజర్వేషన్లు ఉన్నాయి. మహిళా రిజర్వేషన్ కూడా ఒక భాగమే. అయితే మహిళా సాధికారతకై ఉద్దేశించిన రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పడుతుందో తెలియదు. తమ తమ రంగాల్లో చెరగని ముద్ర వేస్తున్న మరింత మంది మహిళలను గుర్తించడం సవాలుతో కూడుకున్న పనే. వే ఫౌండేషన్ వంటి అనేక సంస్థలు మరిన్ని ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు పెరగాల్సిన ఆవశ్మకత ఉంది’ అని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు