విశాఖలో చీపురు పట్టిన వెంకయ్య

24 Oct, 2014 19:47 IST|Sakshi
విశాఖలో చీపురు పట్టిన వెంకయ్య

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చీపురు పట్టుకున్నారు. రెండు వారాల క్రితం హుదూద్ తుఫాను అల్లకల్లోలలం సృష్టించిన విశాఖపట్నం ప్రాంతంలో ఆయన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో పాల్గొన్నారు. తన మద్దతుదారులతో కలిసి బీచ్ ప్రాంతాన్ని శుభ్రం చేశారు. తుఫాను గాలులకు తీరానికి కొట్టుకొచ్చిన శిథిలాలను వెంకయ్య బృందం తొలగించింది.

స్వచ్ఛభారత్ను ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు వ్యాధుల బారి నుంచి తమను తాము కాపాడుకోవాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గాంధీ జయంతి రోజున దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ ఉద్యమానికి అపూర్వ స్పందన వస్తోందన్నారు. గత మూడు రోజులుగా ఆయన విశాఖలో ఉన్నారు. తుఫాను ప్రభావంతో అల్లకల్లలోంగా మారిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత సాయం అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. తుఫాను కారణంగా ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 46 మంది మరణించారు.

మరిన్ని వార్తలు