'కుల దురహంకారాన్ని మరోసారి బయటపెట్టావ్‌'

5 Jan, 2020 19:19 IST|Sakshi

సాక్షి, విజయవాడ: దళిత ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె. వెంకటరామిరెడ్డి తీవ్రంగా ఖండించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుకు మొదటి నుంచి ఉద్యోగులంటే చులకన భావం అని, ప్రజలు ఇచ్చిన తీర్పుకు ప్రెస్టేషన్‌లో ఉ‍న్న చంద్రబాబు ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. విజయ్‌కుమార్‌ను విమర్శించడం ద్వారా తన కుల దురహంకారాన్ని చంద్రబాబు మరోసారి బయట పెట్టుకున్నారని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

చదవండి: చంద్రబాబు క్షమాపణ చెప్పాకే.. బయటకు కదలాలి

ఏసీబీతో ఉద్యోగ సంఘాల నేతలను సీఎం బెదిరిస్తున్నారని దేవినేని ఉమా అబద్దాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగులను బెదిరించిన చరిత్ర ఎవరికైనా ఉందంటే అది ఒక్క చంద్రబాబుకు మాత్రమే దక్కుతుందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన వారిని ఇంటికి పిలిపించి పోటీ చేయొద్దని బెదిరించిన చిల్లర మనిషి చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అధికారుల మీద దాడి జరిగితే దాడి చేసిన వారిని వెనకేసుకొచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. 

భగ్గుమన్న దళిత సంఘాలు:
చంద్రబాబు వ్యాఖ్యలపై కాకినాడలో దళిత సంఘాలు భగ్గుమన్నాయి. దళిత ఐఏఎస్‌ అధికారి విజయకుమార్‌ను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడిన చంద్రబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశాయి. నలభై ఏళ్ళ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు కుల అహంకారిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డాయి. చంద్రబాబు వ్యాఖ్యలను ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు బత్తు భీమారావు, ఎం డేవిడ్‌, ప్రసాద్‌, శ్రీను పాల్గొన్నారు. 

చదవండి: ఇవేం మాటలు బాబూ

చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్దం చేయడానికి యత్నం
ఒక దళిత ఐఏఎస్‌ అధికారిని ఇష్టానుసారంగా మాట్లాడిన చంద్రబాబు దిష్టిబొమ్మ దహనానికి ఎస్సీ కుల సంఘాలు ప్రయత్నించాయి. మచిలీపట్నంలోని లక్ష్మీ టాకీస్‌ సెంటర్‌లో అంబేద్కర్‌ విగ్రహం వద్ద దిష్టి బొమ్మ దహనానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. విజయకుమార్‌ను అవమానకరంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడును వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

చదవండి: విజయకుమార్‌గాడు మాకు చెబుతాడా!

మరిన్ని వార్తలు