‘40 ఇయర్స్ ఇండస్ట్రీ చర్యలు ఎందుకు తీసుకోలేదో’

30 Aug, 2019 14:27 IST|Sakshi

సాక్షి, అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ప్రచారం వెలుగు చూడటంతో ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టీటీడీ, దేవాదాయ శాఖల్లో హిందూయేతరులు ఉద్యోగం చేయడానికి వీల్లేదని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ అంశంపై ప్రభుత్వ తీరును తప్పుబడుతున్న టీడీపీ నేతలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘టీటీడీ, దేవాదాయ శాఖల్లో హిందూయేతర ఉద్యోగులు పనిచేయడాన్ని నిషేధిస్తూ ఏపీ సీఎం జగన్‌ గారు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ సెల్ఫ్ డబ్బా వాయించుకునే పెద్ద మనిషి చంద్రబాబు ఇన్నాళ్లు ఎందుకు ఇటువంటి చర్యలు తీసుకోలేదో ప్రజలకు వివరించాలి’అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

అంతకు ముందు.. ‘గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ కోసం 4 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టిస్తే ప్రశంసించే పెద్ద మనసు లేదు. రిక్షాలు తొక్కాలని, హమాలీ పని చేయాలి అంటూ నిరుద్యోగులను బెదరగొట్టిన పాపం ఊరికే పోదు చంద్రబాబు గారూ. ఈ ఐదేళ్లలో ఇంకా చాలా చూస్తారు. గుండె రాయి చేసుకోండి’అని విజయసాయిరెడ్డి చురకలంటించారు.

మరిన్ని వార్తలు