ఏపీలో అతి త‌క్కువ క‌రోనా కేసులు

27 Mar, 2020 15:38 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో క‌రోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్ట‌డానికి ఏపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌టిష్ట చ‌ర్య‌ల‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌ సాయిరెడ్డి ప్ర‌శంసించారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తీసుకుంటున్న ముంద‌స్తు చ‌ర్య‌ల వ‌ల్లే దేశంలో అతి త‌క్కువ క‌రోనా కేసులు న‌మోదైన రాష్ట్రంగా ఏపీ నిలిచింద‌ని కొనియాడారు. అలాగే ఇత‌ర రాష్ట్రాల్లో ఉండే ఏపీ ప్ర‌జ‌ల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.  

కరోనా పరీక్షల వైద్య పరికరాల కోసం 10 లక్షలు

ఈ మేర‌కు ట్విట‌ర్ ద్వారా స్పందించిన ఆయ‌న‌ వ‌రుస ట్వీట్లు చేశారు. ‘సీఎం జగన్ తీసుకున్న ముందస్తు చర్యల వలన దేశంలోనే అతి తక్కువ కరోనా పాజిటివ్ కేసులున్న రాష్ట్రంగా ఏపీ ఆదర్శంగా నిలిచింది. గ్రామ వలంటీర్లకు పని విభజన చేసి ప్రతి వ్యక్తి హెల్త్ రికార్డును తయారు చేయడం అత్యంత క్లిష్టమైన కార్యక్రమం. దాని ఫలితాలు కనిపిస్తున్నాయి’ అని ట్వీట్ చేశారు. (ఏపీలో కరోనా కట్టడికి మూడంచెల వ్యవస్థ)

‘సీఎం జగన్  ఏర్పాటు చేసిన వలంటీర్ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శంగా మారుతోంది. యుకే ప్రభుత్వ నేషనల్ హెల్త్ సర్వీస్(NHS) 2.80 లక్షల మంది వలంటీర్ల అవసరముందని ప్రకటించి అత్యవసర నియామకాలు చేపట్టింది. ఇంతకంటే ప్రశంస ఇంకా ఏం కావాలి మన వలంటీర్ వ్యవస్థకు’ అంటూ కరోనాపై ఆందోళన చెందాల్సిన పని లేదన విజయ సాయిరెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు